NTR Evaru Meelo Koteeswarulu: రాజమౌళి, కొరటాల గడగడలాడించిన ఎన్టీఆర్.. ఆ ప్రశ్నలతో చమటలు పట్టించేశాడుగా!

NTR Evaru Meelo Koteeswarulu

NTR Evaru Meelo Koteeswarulu: ప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో రియాలిటీ షోలు ప్రసారమవుతున్నాయి. అందులో ఎక్కువగా నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 5, ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షోలు మంచి రేటింగ్ దూసుకుపోతున్నాయి.

  • Share this:
    NTR Evaru Meelo Koteeswarulu: ప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో రియాలిటీ షోలు ప్రసారమవుతున్నాయి. అందులో ఎక్కువగా నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 5, ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షోలు మంచి రేటింగ్ దూసుకుపోతున్నాయి. ఓ పక్కా బిగ్ బాస్, మరోపక్క ఎవరు మీలో కోటీశ్వరులు షోలతో బుల్లితెర ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఉంటే తాజాగా ఎవరు మీలో కోటీశ్వరులులో రాజమౌళి, కొరటాల ఎంట్రీ ఇచ్చారు.

    వెండితెరపై తమ దర్శకత్వంతో మంచి సినిమాలను తెరకెక్కించి స్టార్ దర్శకులుగా నిలిచిన ఎస్ ఎస్ రాజమౌళి, కొరటాల శివ గురించి ప్రేక్షకులందరికి తెలిసిందే. ఇక వీరు ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉండగా.. తాజాగా ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షోకు అతిథులుగా వచ్చి బాగా సందడి చేశారు. తమ మాటలతో ఎన్టీఆర్ ను బాగా ఆట పట్టించారు. కొరటాల శివ ఎంట్రీ తోనే రోల్ కెమెరా యాక్షన్ అని సరదాగా అనగా పక్కనే ఉన్న రాజమౌళి కూడా సౌండ్ క్లాటింగ్ యాక్షన్ అంటూ ఎన్టీఆర్ ను కాస్త ఆట పట్టించారు.

    ఇది కూడా చదవండి: ఇక్కడ నేనే బాస్ అంటూ రాజమౌళి, కొరటాలను వణికించేసిన ఎన్టీఆర్!

    ఇక మధ్య మధ్యలో వారిద్దరు వాళ్లు వాళ్ళే మాట్లాడుకోవడంతో ఎన్టీఆర్ ఎంతసేపు మీరు మీరే మాట్లాడుకోవమేనా మాకు అవకాశం ఇచ్చేది లేదా అంటూ కాస్త ఫన్నీగా మాట్లాడాడు. అంతే కాకుండా మరోసారి కొరటాల, రాజమౌళి ఎన్టీఆర్ తో కాస్త గట్టిగా మాట్లాడే సరికి వెంటనే ఎన్టీఆర్ ఇది నా లొకేషన్, ఇది నా డైరెక్షన్ ఇక్కడ నేనే బాస్ అంటూ సరదాగా కామెంట్ చేయగా దర్శకులు తెగ నవ్వుకున్నారు. మొత్తానికి హాట్ సీట్ల పై కూర్చున్న ఈ స్టార్ దర్శకులు మాత్రం ఎన్టీఆర్ తో గేమ్ లో పాల్గొన్నారు.

    ఇది కూడా చదవండి:రికార్డు సృష్టించిన ఎవరు మీలో కోటిశ్వరులు.. ఆ విషయంలో నాగార్జున, చిరంజీవిని కూడా వెనక్కి నెట్టిన ఎన్టీఆర్!

    ఈ దర్శకులు ఆటలోకి సీరియస్ గా దిగారు. మొదటి రెండు ప్రశ్నల తర్వాత మూడో ప్రశ్న సింగర్స్ ది రావడంతో.. వెంటనే రాజమౌళి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఆ పాటను బాలసుబ్రహ్మణ్యంకు అత్యంత ఇష్టమైన మహమ్మద్ రఫీ పాడారు అని తెలిపాడు. ఇక వరుసగా ఏడు ప్రశ్నలు చెప్పగా 8 వ ప్రశ్నకు 50:50 లైఫ్ లైన్ వాడారు. ఆ తర్వాత పదో ప్రశ్న దగ్గర జవాబు తెలియకపోవడంతో మరో లైఫ్ లైన్ తీసుకున్నారు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కు వీడియో కాల్ చేసి సమాధానం తెలుసుకున్నారు. ఇక 12 ప్రశ్న కూడా పూర్తవడంతో ఈ ప్రశ్న తర్వాత ఆట ముగిసింది. దీంతో ఎన్టీఆర్ ఆట ముగిసిందని తెలుపగా ఇందులో వీళ్లు 25 లక్షలు గెలుచుకున్నారు. మొత్తానికి ఈ స్టార్ హీరోతో ఈ స్టార్ దర్శకులు బాగా సందడి చేశారు.
    Published by:Navya Reddy
    First published: