Home /News /movies /

SS RAJAMOULI ABOUT RAM CHARAN INTRODUCTION SEQUENCE IN RRR SB

RRR లో రామ్ చరణ్ ఎంట్రీ ఫైట్ కంపోజ్ ఎవరో తెలుసా? ఆ క్రెడిట్ మొత్తం ఆయనకే ఇచ్చిన రాజమౌళి

ఆర్ఆర్ఆర్ తెర వెనక కహాని (NTR Ram Charan RRR Movie Photo : Twitter)

ఆర్ఆర్ఆర్ తెర వెనక కహాని (NTR Ram Charan RRR Movie Photo : Twitter)

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రామ్ చరణ్,తారక్ ఎవరికి వారు.. పూర్తిగా మేకోవర్ అయ్యారు.పాత్రలో జీవించేందుకు ఎంతో కష్టపడ్డారు. వారిద్దరి కష్టం ఫలితమే ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది.

    ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ సీన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్‌లో ఓ సీన్‌లో రామ్ చరణ్ ఎంట్రీ సీన్‌లో భారీ ఎత్తున జనం ఉంటారు. వాళ్లందర్నీ ఒక్క ఉదుటన వెనక్కి నడిచేలా చేస్తాడు. ఇక ఆ సినిమా కోసం రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సీన్ క్రెడిట్ మొత్తం కొరియో గ్రాఫర్ సాల్మన్‌కు ఇస్తానన్నారు రాజమౌళి. అంతకుముందు ఆయన ఆ సీన్ కోసం హాలీవుడ్ కొరియో గ్రాఫర్‌ను హైర్ చేశానన్నారు. అయితే ఆయన కూడా ఓ అద్భుతంగా సీన్ చేసి ఇచ్చారన్నారు. అయితే అది తనకు నచ్చలేదన్నారు. దీంతో ఆయన సాల్మన్‌కు చెప్పడంతో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ అద్భుతంగా వచ్చేలా చేశాడన్నారు. అతనికి ఈసందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు రాజమౌళి.

    రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్' విడుదలై ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెరపై అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటించి మెప్పించారు. అయితే దాని వెనుక ఎంతో కష్టం దాగుంది. సినిమాలో రామ్ చరణ్ బాక్సింగ్ చేసే సన్నివేశాలు ఉన్నాయి. వాటి కోసం చెర్రీ ఎలా కష్టపడ్డాడో చూడండి. ఎన్టీఆర్ ప్రతీది గుర్తుంచుకుంటాడన్నారు. ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ పులి సీన్ కూడా అద్భుతంగా వచ్చిందన్నారు. ఎన్టీఆర్ ప్రతీ సీన్ కూడా గుర్తుకు పెట్టుకుంటాడని చెప్పుకొచ్చారు. ప్రతీ సీన్‌లో జరిగిన మార్పులు కూడా అతడు గమనిస్తాడని చెప్పారు. తారక్ ఓ టెరిఫిక్ యాక్టర్ అన్నారు రాజమౌళి.

    ఆర్ఆర్ఆర్ మూవీ కోసం అటు తారక్ తో పాటు ఇటు రామ్ చరణ్ కూడా పూర్తిగా మేక్ ఓవర్ అయ్యాడు. పోలీసుగా లాఠీ పట్టడం సహా విలువిద్య నేర్చుకొని.. ఫ్యాన్స్ ను అబ్బురపరిచాడు. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా రామ్ చరణ్ కు బాక్సింగ్ లో ట్రైనింగ్ ఇచ్చారు నీరజ్ గోయత్.. ఈ సినిమా కోసం చరణ్ కష్టపడి బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. ప్రత్యేకంగా రామ్ చరణ్ లుక్.. బాక్సింగ్, విలువిద్య గురించి ఆయన ఫ్యాన్స్ ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Rajamouli, Ram Charan, RRR, SS Rajamouli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు