#MeToo: అర్జున్‌పై 5 పేజీల కంప్లైంట్.. శృతి మించిన వివాదం..
35 ఏళ్ల కెరీర్లో యాక్షన్ కింగ్ అర్జున్ ఎప్పుడూ ఎవరితో ఒక్క మాట కూడా అనిపించుకోలేదు. కానీ ఇప్పుడు కన్నడ నటి శృతి హరిహరన్ మాత్రం అర్జున్ సర్జాపై ఓ రేంజ్లో రెచ్చిపోతుంది. తనని లైంగికంగా వేధించడమే కాకుండా ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడంటూ ఫైర్ అవుతుంది. అతడిపై 5 పేజీల కంప్లైంట్ పైల్ చేసింది.

అర్జున్, శృతి హరిహరన్
- News18 Telugu
- Last Updated: October 27, 2018, 2:37 PM IST
#మీటూ వివాదం ఇప్పుడు టాప్ లెవల్‌కు వెళ్లిపోయింది. వీళ్లు వాళ్లు అనే తేడా లేకుండా అంతా #మీటూ సుడిగుండంలో ఇరుక్కుని అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఇందులో యాక్షన్ హీరో అర్జున్ కూడా చేరిపోయాడు. ఈయన ఓ సినిమా షూటింగ్ రిహార్సల్ సందర్భంగా తనను లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది శృతి హరిహరన్. ‘విస్మయ’ సినిమా షూటింగ్ సమయంలో తనను నటుడు అర్జున్ సర్జా లైంగికంగా వేధించాడని.. తనను తాకరాని చోట తాకాడని ఆరోపించింది. గత కొన్ని రోజులుగా ఈ కమెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఈ ఆరోపణలను అవాస్తవమని కొట్టిపారేసిన అర్జున్...శ్రుతి ఆరోపణల వెనుక మరెవరైనా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తంచేశారు. ఇలాంటి నిరాధార ఆరోపణలపై మీటూ ఉద్యమం బలహీనపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఈ ఇద్దరిని కాంప్రమైజ్ చేయడానికి కన్నడ సినీ పరిశ్రమ కూడా ముందుకు వచ్చింది. ఈ విషయంపై ప్రముఖ కన్నడ నటుడు, రెబల్‌స్టార్ అంబరీష్ అధ్యక్షతన దాదాపు రెండు గంటల పాటు కన్నడ ఫిల్మ్ ఛాంబర్ రహస్య చర్చలు జరిపింది. అటు అర్జున్.. ఇటు శృతి ఇద్దరి వాదన విన్న తర్వాత ఓ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు అర్జున్ కూడా ఇప్పటికీ మించిపోయింది లేదు.. తనకు బహిరంగ క్షమాపణ చెబితే తాను అంగీకరించి ఈ విషయాన్ని అంతటితో ముగిస్తానని అర్జున్ సర్జా తెలిపారు. అయితే శృతి మాత్రం ఇప్పటికీ తన మాట మీదే ఉంది. అవసరం అనుకుంటే న్యాయపోరాటానికి సిద్ధం అంటుంది.
అన్నట్లుగానే అర్జున్ పై ఐదు పేజీల కంప్లైంట్ ఫైల్ చేసింది. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ దేవరాజ్ కు ఆమె తన కంప్లైంట్ ఇచ్చింది. వాళ్లు కూడా దీన్ని స్వీకరించి విచారణ జరుపుతాం అని చెబుతున్నారు. ఆ ఐదు పేజీల లేఖలో తనను 2015లో అర్జున్ లైంగికంగా వేధించాడని.. అందుకే అతడిపై ఐపిసి సెక్షన్ 354, 354 ఏ, 509 కింద కేసులు పెట్టాలని సూచించింది శృతి. మొత్తానికి రోజురోజుకీ శృతి, అర్జున్ సర్జా వ్యవహారం శృతి మించుతుందే కానీ సద్దు మనిగేలా కనిపించడం లేదు.
Gallery: వాణి కపూర్ హాట్ ఫోటోలు

సినీ నటుడు అర్జున్

అర్జున్ సర్జా శృతి హరిహరన్
ఆడిషన్‌కు వెళ్తే.. ఆ హీరో అక్కడ చేయి పెట్టాడు..
నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు.. వారికి అందుకే అవకాశాలు రావట్లే: తమన్నా
సీనియర్ నటి సంచలనం... ఆ హీరో నా స్కర్ట్‌లో చేయి పెట్టాడు..
బికినీ ధరించాలని మైనర్‌కు నటుడి వేధింపులు..
లైగింక వేధింపులపై శ్రద్ధా శ్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు.. తనపై ఆ దాడి జరిగినపుడు..
చిన్మయిలో నాకు నచ్చేది అదే అంటున్న సమంత..