• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • SRIREDDY BIOPIC I AM RECEIVING THREAT CALLS SAYS PRODUCER RAVI DEVAN MNJ

Srireddy biopic: శ్రీరెడ్డి బయోపిక్.. బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్న నిర్మాత

శ్రీ రెడ్డి (Sri Reddy/Twitter)

Srireddy biopic: వివాదాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి గురించి ప్ర‌త్యేకంగా ఇంట్ర‌డ‌క్ష‌న్ అవ‌స‌రం లేదు. ఒక‌ప్పుడు యాంక‌ర్‌గా ప‌నిచేసిన శ్రీరెడ్డి.. ఆ త‌రువాత గ్లామ‌ర్ ఫీల్డ్‌కి ఎంట్రీ ఇచ్చారు. ఒక‌టి, రెండు సినిమాల్లో న‌టించిన ఈ బ్యూటీ.. కాస్టింగ్ కౌచ్ పేరుతో ఒక్కసారిగా వెలుగులోకి వ‌చ్చారు. త‌న‌ను వాడుకొని అవ‌కాశాలు ఇవ్వ‌లేదంటూ గ‌తంలో ఆమె ఇచ్చిన ఇంట‌ర్వ్యూ వైర‌ల్‌గా మారింది.

  • Share this:
    Srireddy biopic: వివాదాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి గురించి ప్ర‌త్యేకంగా ఇంట్ర‌డ‌క్ష‌న్ అవ‌స‌రం లేదు. ఒక‌ప్పుడు యాంక‌ర్‌గా ప‌నిచేసిన శ్రీరెడ్డి.. ఆ త‌రువాత గ్లామ‌ర్ ఫీల్డ్‌కి ఎంట్రీ ఇచ్చారు. ఒక‌టి, రెండు సినిమాల్లో న‌టించిన ఈ బ్యూటీ.. కాస్టింగ్ కౌచ్ పేరుతో ఒక్కసారిగా వెలుగులోకి వ‌చ్చారు. త‌న‌ను వాడుకొని అవ‌కాశాలు ఇవ్వ‌లేదంటూ గ‌తంలో ఆమె ఇచ్చిన ఇంట‌ర్వ్యూ వైర‌ల్‌గా మారింది. దీంతో ఒక్క‌సారిగా హాట్ టాపిక్ అయిపోయింది శ్రీరెడ్డి. అయితే అంత‌టితో ఆగ‌కుండా ఫిల్మ్‌న‌గ‌ర్‌లో అర్థ‌న‌గ్నంగా శ్రీరెడ్డి సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఆ త‌రువాత టాలీవుడ్‌లోని ప్ర‌ముఖుల‌పై సోష‌ల్ మీడియాలో వ్యాఖ్య‌లు చేస్తూ రెచ్చిపోయింది ఈ న‌టి. అందులో కొంద‌రు ప్ర‌ముఖులు ఆమె వ్యాఖ్యల‌పై స్పందించారు. త‌మ‌కు, శ్రీరెడ్డికి సంబంధం లేద‌ని ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇచ్చారు. అయితే శ్రీరెడ్డి మాత్రం ఆగ‌లేదు. ప‌లువురిని టార్గెట్ చేస్తూ ఆమె వ్యాఖ్య‌లు చేస్తూనే వ‌చ్చారు. ఈ క్ర‌మంలో కొన్ని రోజుల‌కు ఆమెను ఎవ్వ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోగా త‌మిళ‌నాడుకు మకాం మార్చేసింది. చెన్నైలో ఉంటూ అక్కడ కూడా ప‌లువురు హీరోలు, ద‌ర్శ‌కుల‌పై కామెంట్లు చేసింది. ఇప్పుడు ఇటు హైద‌రాబాద్, అటు చెన్నైని చుట్టేస్తుంది ఈ న‌టి.

    ఇదిలా ఉంటే ఈ న‌టి జీవితం ఆధారంగా ఇప్పుడు ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా పనిచేసిన రాజంగ‌మ్ శ్రీరెడ్డి బ‌యోపిక్‌ని తెర‌కెక్కిస్తున్నారు. రెడ్డి డైరీ పేరుతో తెర‌కెక్కిన ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. ఇందులో న‌టి కావాల‌నుకున్న ఓ అమ్మాయిని ఇండ‌స్ట్రీలోని పెద్ద వాళ్లు ఎలా వాడుకున్నారు అన్న‌ది చూపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

    కాగా ఈ సినిమా నిర్మాత ర‌వి దేవ‌న్ తాజాగా మాట్లాడుతూ ఇప్పుడు బెదిరింపు ఫోన్లు వ‌స్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాను ఆప‌మ‌ని కొంద‌రు ఫోన్లు చేసి బెదిరిస్తున్నార‌ని ఆయన అన్నారు. అంతేకాదు ఈ సినిమాను ఆపేస్తామ‌ని త‌న‌కు స‌వాల్ విసురుతున్నార‌ని ఆరోపించారు. దీనిపై తాను పోలీసుకు ఫిర్యాదు చేస్తాన‌ని అన్నారు. ఇక మ‌రో నిర్మాణ సంస్థ డ‌ర్డీ అనే టైటిల్‌ని పెట్టుకోగా.. ఆ టైటిల్ హ‌క్కులు కూడా త‌న ద‌గ్గ‌రే ఉన్న‌ట్లు వివ‌రించారు. మ‌రి ఈ మూవీ విడుద‌ల అవుతుందా.. శ్రీరెడ్డి బ‌యోపిక్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
    Published by:Manjula S
    First published: