Srinu Vaitla : చిరంజీవితో ‘అందరివాడు’ ఫ్లాప్ కావడానికి కారణం అదేనట.. శ్రీను వైట్ల సంచలన వ్యాఖ్యలు చేసారు. శ్రీను వైట్ల విషయానికొస్తే.. ఒకప్పుడు వరుస సక్సెస్‌లతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా సత్తా చాటారు. ఆ తర్వాత వరుస ఫ్లాపులు పలకరించడంతో కాస్త సైలెంట్ అయిపోయారు. త్వరలో ఈయన మంచు విష్ణుతో ‘ఢీ అంటే ఢీ’ అనే సినిమాతో పలకరించబోతున్నారు. ఈ సినిమా సక్సెస్ అనేది హీరోగా మంచు విష్ణుకు దర్శకుడిగా శ్రీను వైట్లకు అత్యంత కీలకం అనే చెప్పాలి. తాజాగా ఈయన ఆలీ (Ali Tho Saradaga)తో సరదగా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీను వైట్ల తన సినీ కెరీర్‌కు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్బంగా మహేష్ బాబు.. ‘దూకుడు’ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేదు.
ఈ సినిమా విడుదలైన పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీను వైట్ల రీసెంట్‌గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేష్ బాబు ఓకే చెబితే.. దూకుడుకు సీక్వెల్ తీసే ఆలోచన ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక దూకుడు తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన ‘ఆగడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆగమైపోయింది. దీంతో మహేష్ బాబు మరోసారి శ్రీను వైట్లకు అవకాశం ఇస్తాడా అనేది చూడాలి. ఇక ఆగడు నుంచి శ్రీను వైట్ల ఇప్పటి వరకు సక్సెస్ అన్నది లేదు. ఆ తర్వాత చేసిన ‘బ్రూస్లీ’, ‘మిస్టర్’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ ఒక దాన్ని మించి ఒకటి డిజాస్టర్స్‌గా నిలిచాయి.
శ్రీను వైట్ల విషయానికొస్తే.. ఈయన యాక్షన్ ప్లస్ కామెడీ ఈయన బలం. ఏ సినిమా తీసుకున్న దానికి సరైన కామెడీ జోడించి తెరకెక్కించి హిట్స్ అందుకోవడం శ్రీను వైట్ల సక్సెస్ సీక్రెట్. ఆ తర్వాత అది గాడి తప్పడంతో వరుస ఫ్లాప్స్ పలకరించాయి. ఇక చిరంజీవితో చేసిన ’అందరివాడు’ సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాలను వెల్లడించారు.
Nagarjuna : ప్రపంచ సినీ చరిత్రలో ఆ రికార్డు ఒక్క నాగార్జునకు మాత్రమే సాధ్యమైంది..
‘అందరివాడు’ సినిమా స్టోరీని తనది కాదన్నారు. ఆల్రెడీ రెడీగా ఉన్న కథను తనను డైరెక్ట్ చేయమన్నారు. చిరంజీవి సినిమా పైగా కథ రెడీగా ఉండటంతో ఏమి చెప్పలేకపోయాను. ఒక వేళ తన కథతో సినిమా తెరకెక్కించి ఉంటే.. ఫలితం మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. ఇక లైఫ్‌లో సెల్ఫీస్‌గా ఉండటం నేర్చుకోవాలి. ముందుగా ఎవరిని వారు కాపాడుకోవడం నేర్చుకోవాలన్నారు. ఇక ఆగడు సినిమా ఫ్లాప్ కావడానికి కారణం.. ‘దూకుడు’ తర్వాత ఊర మాస్ సినిమా చేయమని మహేష్ ప్యాన్స్ నుంచి ఒత్తిడి రావడంతో ఈ సినిమాను తెరకెక్కించాను. ఫలితం తేడా కొట్టింది.
ఇక అజిత్ తనకు ‘దూకుడు’ మూవీ రీమేక్ చేయమని ఆఫర్ ఇచ్చారు. అపుడు వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఆయనకు ఓకే చెప్పలేకపోయాను. ఇప్పటికీ ఆ భాద నన్ను వెంటాడుతోంది. శ్రీను వైట్ల ప్రస్తుతం మంచు విష్ణుతో ‘డీ అంటే ఢీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘ఢీ’ మూవీకి సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. కానీ శ్రీను వైట్ల కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు చెప్పారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Mahesh Babu, Srinu Vaitla, Tollywood