హోమ్ /వార్తలు /సినిమా /

Srinivas Murthy: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూత..

Srinivas Murthy: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూత..

డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూత (File/Photo)

డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూత (File/Photo)

Srinivas Murthy: తెలుగు తెరపై మనకి స్ట్రెయిట్ చిత్రాలతో ఎన్నో డబ్బింగ్ చిత్రాలు మనల్ని పలకరిస్తూ ఉంటాయి. అలా తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి చేరువైన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి గుండెపోటుతో కన్నుమూసారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Srinivas Murthy: తెలుగు తెరపై మనకి స్ట్రెయిట్ చిత్రాలతో ఎన్నో డబ్బింగ్ చిత్రాలు మనల్ని పలకరిస్తూ ఉంటాయి. అందులో హీరో మాట్లాడే ఆవేశపూరిత మాటలు, డైలాగులు మనల్ని ఎంతగానో అలరిస్తాయి. అలా ఎంతో మంది తమిళ హీరోలకు తెలుగులో గాత్రం అందించిన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి గుండెపోటుతో చెన్నైలోని స్వగృహంలో  కన్నమూశారు. ముఖ్యంగా సూర్య నటించిన సింగం సహా ఎన్నో సినిమాల్లో తన వాయిస్‌తో ఆయా సినిమాలకు ప్రాణం పోసారు శ్రీనివాస మూర్తి. సాయి కుమార్ తర్వాత తమిళ హీరోలకు పెద్ద దిక్కు అయ్యారు శ్రీనవాస మూర్తి. అటు విక్రమ్ హీరోగా నటించిన తెలుగు డబ్బింగ్ సినిమాలకు కూడా ఈయన తన గొంతుతో ప్రాణం పోసారు. ముఖ్యంగా అపరిచితుడు సినిమాలో విక్రమ్ పాత్రకు ఈయన చెప్పిన డబ్బింగ్ గురించి అందరు గొప్పగా చెప్పుకున్నారు. సూర్య, విక్రమ్ మాత్రమే కాకుండా జనతా గ్యారేజ్‌లో మోహన్‌‌లాల్‌కు, తెగింపు, వలీమై సహా అజిత్ నటించిన చాలా చిత్రాలకు ఈయన మాటే తెరపై వినిపించింది మనకు .అలాంటి వాయిస్ ఇక లేదంటే అభిమానులకు జీర్ణించుకోవడము కష్టమే.

ఆయన లైవ్‌లో డబ్బింగ్‌లు చెబుతుంటే తమిళ తంబీలు మన ముందు కదులుతున్నట్టు ఉంటుంది. ముఖ్యంగా తన డబ్బింగ్ విధానం, వేరియేషన్స్‌తో సోషల్ మీడియాలో ఆయన కంటూ ప్రత్యేక అభిమాన గణాన్ని ఏర్పరుచుకున్నాడు.  మొత్తంగా ఈయన మృతి తమిళ హీరోల తెలుగు డబ్బింగ్ సినిమాలకు అశనిపాతమనే చెప్పాలి. ఈ రోజే ప్రముఖ లెజండరీ నటీమణి జమున కన్నుమూసిన సంగతి మరవక ముందే ఈయన కన్నుమూయడం చిత్రసీమకు తీరని లోటు అని చెప్పాలి.

First published:

Tags: Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు