SRIMUKHI WILL BE THE ANCHOR FOR NAGABABU NEW COMEDY SHOW BOMMA ADIRINDI SK
Nagababu: నాగబాబు కొత్త కామెడీ షో.. రవి ఔట్.. యాంకర్‌గా శ్రీముఖి..
నాగబాబు
అదిరింది షో నుంచి ఎగ్జిట్ అయిన యాంకర్ రవి.. జబర్దస్త్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ ప్రోమో కూడా విడుదలయింది. రాకింగ్ రాకేష్ స్కిట్లో స్కూటర్ మీద వచ్చి 'రవి దువ్వాడ' అంటూ సందడి చేశాడు.
'జబర్దస్త్' నుంచి బయటకు వచ్చిన తర్వాత నాగబాబు వేరు కుంపటి పెట్టుకున్న విషయం తెలిసిందే. జీతెలుగులో ప్రసారమయ్యే అదిరింది ప్రోగ్రామ్‌కు జడ్జికిగా వ్యవహరించారు. ఈ రెండు షోల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది. ఐతే లాక్డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే క్లిక్ అవుతున్న 'అదిరింది షో' సడెన్‌గా ఆగిపోయింది. గత ఆదివారం కూడా ఎపిసోడ్ ప్రసారం కాలేదు. 'బెస్ట్ ఆఫ్ అదిరింది' పేరుతో పాత స్కిట్లు ప్రసారం చేశారు. ఆ ఎపిసోడ్‌తో 'అదిరింది' అభిమానులు షాక్ అయ్యారు. ఏంటి ఇవాళ ఎపిసోడ్ ప్రసారం కాలేదని చర్చించుకున్నారు. 'అదిరింది'కి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ వస్తున్న సమయంలో తీసేశారేంటి.. అని గుసగుసలాడుకున్నారు. ఈ క్రమంలోనే జీతెలుగు మరో బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది.
'అదిరింది' స్థానంతో.. 'బొమ్మ అదిరింది' అంటూ కొత్త ప్రోమోను వదిలారారు. ఇది ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. జడ్జిగా నాగబాబు, టీమ్ లీడర్లుగా పాత వారే ఉన్నారు. కానీ మరో జడ్జి నవదీప్, యాంకర్లు రవి, భాను కనిపించలేదు. రవి, భానును తీసేసి వారి స్థానంలో శ్రీముఖిని తీసుకున్నట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఆ ప్రోమోలో నాగబాబు, శ్రీముఖి, చంద్ర, డాన్సర్ పండు, ధన్రాజు, వేణు, సద్దాం కనిపించారు. వీరితో పాటు అలీ, యాంకర్ సుమ, డాన్స్ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ సందడి చేశారు.
ఐతే షో ప్రారంభోత్సవానికి మాత్రమే యాంకర్ సుమ వచ్చిందా? లేదంటే ఇకపైనా కొనసాగతుందా? అన్నది తెలియాల్సి ఉంది. 'బొమ్మ అదిరింది; షోకు నాగబాబుతో పాటు జాని మాస్టర్ జడ్జిలుగా వ్యవహరించనున్నట్లు సమాచారం.
మరోవైపు అదిరింది షో నుంచి ఎగ్జిట్ అయిన యాంకర్ రవి.. జబర్దస్త్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ ప్రోమో కూడా విడుదలయింది. రాకింగ్ రాకేష్ స్కిట్లో స్కూటర్ మీద వచ్చి 'రవి దువ్వాడ' అంటూ సందడి చేశాడు. దువ్వడానికే వచ్చావుగా.. అని యాంకర్ రష్మీ సెటైర్లు వేసింది. ఆ తర్వాత రోహిణి కూడా పంచ్‌లు వేసింది. 'కొందరు అక్కడా ఇక్కడా తిరిగి చివరకు ఇక్కడికే వస్తారు.' అని జోకులు పేల్చింది. అప్పుడు ప్రేక్షకులకు పెద్దగా అర్ధం కాలేదు. కానీ జీతెలుగు విడుదల చేసిన 'బొమ్మ అదిరింది షో' ప్రోమోతో క్లారిటీ వచ్చింది. నాగబాబు కొత్త కామెడీ షో మొదలు పెట్టారని.. శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తోందని తెలిసింది. అక్కడి నుంచి వెళ్లిపోయిన రవి జబర్దస్త్‌లో ఎంట్రీ ఇచ్చాడని స్పష్టమవుతోంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.