శ్రీముఖి దెబ్బకు యాంకర్ రవి ఔట్...రచ్చ మామూలు రేంజులో లేదుగా...

ఒక వైపు యాంకర్ రవి, శ్రీముఖి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజులో గొడవలు జరుగుతున్నాయనేది బయట టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రవి హోస్ట్ చేస్తున్న లోకల్ గ్యాంగ్స్ కన్నా శ్రీముఖి హోస్ట్ చేస్తున్న స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ ప్రోగ్రాం రేటింగ్స్ పరంగా ముందు వరుసలో నిలవడం సంచలనంగా మారింది.

news18-telugu
Updated: December 22, 2019, 2:41 PM IST
శ్రీముఖి దెబ్బకు యాంకర్ రవి ఔట్...రచ్చ మామూలు రేంజులో లేదుగా...
యాంకర్ రవితో శ్రీముఖి
  • Share this:
బిగ్ బాస్ రన్నరప్ గా పేరు తెచ్చుకున్న శ్రీముఖికి ఉన్న క్రేజ్ మామూలు స్థాయిలో లేదు. ఆమె తన కంబ్యాక్ షోగా ప్రారంభించిన స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ విజయవంతంగా దూసుకెళుతోంది. ముఖ్యంగా ఈ షోలో శ్రీముఖి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే పటాస్ షో ద్వారా పాపులర్ అయిన శ్రీముఖి ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి తన ఇమేజ్ ను అమాంతంగా పెంచేసుకుంది. అంతేకాదు బయటకు రాగానే ఒక భారీ ప్రోగ్రాం ద్వారా తన కమ్ బ్యాఖ్ తో విజయం సాధించింది. అయితే అదే పటాస్ షో నుంచి బయటకు వచ్చిన యాంకర్ రవి కూడా తాజాగా లోకల్ గ్యాంగ్స్ పేరిట కొత్త ప్రోగ్రాం ప్రారంభించాడు. రవి ఎప్పటి లాగే తన ఎనర్జీ పెర్ఫార్మెన్స్‌తో లోకల్ గ్యాంగ్స్ ను తన భుజాలపై వేసుకున్నాడు. ఇంతలోనే తాజాగా రెండు ప్రోగ్రామ్స్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఇందులో మాత్రం శ్రీముఖి తన సత్తా చాటింది. లోకల్ గ్యాంగ్స్ కన్నా స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ ప్రోగ్రాం మెరుగైన టీఆర్పీ రేటింగ్స్ సాధించింది.

ఒక వైపు యాంకర్ రవి, శ్రీముఖి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజులో గొడవలు జరుగుతున్నాయనేది బయట టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రవి హోస్ట్ చేస్తున్న లోకల్ గ్యాంగ్స్ కన్నా శ్రీముఖి హోస్ట్ చేస్తున్న స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ ప్రోగ్రాం రేటింగ్స్ పరంగా ముందు వరుసలో నిలవడం సంచలనంగా మారింది. అయితే వీరిద్దరి మధ్య పోటీ ఇప్పుడే ఇలాగ ఉంటే ముందు ముందు ఏ రేంజులో వీరిద్దరి మధ్య పోటీ వేడెక్కుతుందనేది హాట్ టాపిగ్గా మారింది.
First published: December 22, 2019, 2:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading