Sreemukhi: లాక్‌డౌన్‌లో శ్రీముఖి స్పూఫ్ కామెడీ.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచాన్ని కరోనా వైరస్ అనే మహామ్మారి పట్టిపీడిస్తోంది.తాజాగా మీలో ఎవరికి బోర్ కొడుతుంది అనే స్పూఫ్ వీడియోతో శ్రీముఖి ఆడియన్స్ ముందుకొచ్చింది.

news18-telugu
Updated: April 25, 2020, 6:24 PM IST
Sreemukhi: లాక్‌డౌన్‌లో శ్రీముఖి స్పూఫ్ కామెడీ.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..
శ్రీముఖి పేరడి షో (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచాన్ని కరోనా వైరస్ అనే మహామ్మారి పట్టిపీడిస్తోంది. దీంతో ఈ వైరస్ కట్టడిలో భాగంగా సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయడంతో భాగంగా దేశంలో లాక్‌డౌన్ విధించారు. దీంతో అత్యవసర సేవలు చేసేవాళ్లు తప్పించిన అందరు ఇంట్లోనే ఉన్నారు. ఈ లాక్‌డౌన్‌ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు, సీరియల్స్‌కు సంబంధించిన అన్ని షూటింగ్స్‌కు బ్రేక్ వచ్చింది. దీంతో ఎపుడు ఏదో ఒక వ్యాపకంతో ఉండే హీరో, హీరోయిన్స్, యాంకర్లు టైమ్ పాస్ కోసం ఏదో ఎంటర్టైన్మెంట్‌ను ప్రేక్షకులకు తమదైన రీతిలో ఎంటర్టైన్ చేస్తున్నారు. రీసెంట్‌గా శ్రీముఖి, విష్ణు ప్రియ, అవినాష్ కలిసి బతుకు బలైపోయిన బండి అనే స్పూఫ్ కామెడీ షో చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మీలో ఎవరికి బోర్ కొడుతుంది అనే స్పూఫ్ వీడియోతో ఆడియన్స్ ముందుకొచ్చింది. అమితాబ్, నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన మీలో ఎవరు కోటీశ్వరుడు టైప్‌లో ఈ స్పూఫ్ కామెడీ షో చేసారు. ఈ స్పూఫ్ కామెడీలో అవినాష్ నాగార్జున మాదిరిగా సీట్లో కూర్చండగా హాట్ సీట్‌లో శ్రీముఖి కూర్చొని ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Published by: Kiran Kumar Thanjavur
First published: April 25, 2020, 6:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading