వైరల్ సాంగ్... కన్నడ పాటను పాడిన శ్రీలంక సింగర్... నెటిజన్లు ఫిదా

Srilankan Singer Hansini Wimalsiri : ఈ పాట పాడేటప్పుడు బహుశా... హన్సినీ కూడా అది ఇంతలా క్లిక్ అవుతుందని అనుకొని ఉండదు. 3.14 నిమిషాల ఈ సాంగ్‌ని ఇప్పటికే 50వేల మందికి పైగా చూశారు.

Krishna Kumar N | news18-telugu
Updated: October 1, 2019, 10:20 AM IST
వైరల్ సాంగ్... కన్నడ పాటను పాడిన శ్రీలంక సింగర్... నెటిజన్లు ఫిదా
కన్నడ పాటను పాడిన శ్రీలంక సింగర్... నెటిజన్లు ఫిదా (Credit - YT - Ambient Luxe)
  • Share this:
కన్నడ మ్యూజిక్ డైరెక్టర్లు... చాలా పాటలకు... సింగర్లను బాలీవుడ్ లేదా కోలీవుడ్ నుంచీ రప్పిస్తుంటారు. అఫ్‌కోర్స్ కన్నడిగులు కూడా ఆ సింగర్స్ స్వీట్ వాయిస్‌కి మెల్ట్ అయిపోయారు. తాజాగా KGF చాప్టర్-2 కోసం రాసిన... సప్తసాగరద మమ్మ అనే సాంగ్ ఇప్పుడు వైరల్ అయిపోయింది. ఇందుకు కారణం KGF సినిమా కాదు... ఈ పాటను ఓ శ్రీలంక సింగర్ పాడటమే. కన్నడ భాషలో శ్రీలంక సింగర్ హన్సినీ విమల్సిరి అత్యంత చక్కగా పాడటంతో... కన్నడిగులు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన ఈ సాంగ్‌ను నెటిజన్లు తెగ చూస్తున్నారు. ఆమె ఎంతో మెలోడియస్‌గా పాడిందనీ, స్వరాలన్నీ చక్కగా పలికిందనీ, ఫీల్ కలిగిస్తోందనీ అంటున్నారు.శ్రీలంక... కోక్ స్టూడియోలోని జరిగిన యాంబియంట్ లక్సే సీజన్-1లో... ఈ సాంగ్ పాడి వినిపించింది హన్సినీ. ఈ పాట పాడేటప్పుడు బహుశా... హన్సినీ కూడా అది ఇంతలా క్లిక్ అవుతుందని అనుకొని ఉండదు. 3.14 నిమిషాల ఈ పాటని ఇప్పటికే 50వేల మందికి పైగా చూశారు. ఈ ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: October 1, 2019, 10:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading