• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SRIHARI PRAKASH RAJ DO YOU KNOW ABOUT RELATION BETWEEN VERSATILE ACTOR PRAKASH RAJ AND REAL STAR SRIHARI TA

Srihari - Prakash Raj: రియల్ స్టార్ శ్రీహరి, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య ఉన్న ఈ సంబంధం తెలుసా ..

Srihari - Prakash Raj: రియల్ స్టార్ శ్రీహరి, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య ఉన్న ఈ సంబంధం తెలుసా ..

శ్రీహరి, ప్రకాష్ రాజ్ (File/Photo)

Srihari - Prakash Raj | తెలుగు సినీ ఇండస్ట్రీలోప్రకాష్ రాజ్, శ్రీహరి ఇద్దరూ ఇద్దరే. వీళ్లిద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, హీరోగా నటించారు. వీళ్లిద్దరు మధ్య ఓ రిలేషన్ ఉంది.

  • Share this:
    Srihari - Prakash Raj : తెలుగు సినీ ఇండస్ట్రీలోప్రకాష్ రాజ్, శ్రీహరి ఇద్దరూ ఇద్దరే. వీళ్లిద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, హీరోగా నటించారు. ప్రకాష్ రాజ్ కంటే దివంగత శ్రీహరి రియల్ స్టార్‌గా తన కంటూ మాస్‌లో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. అంతకు ముందు శ్రీహరి.. తెలుగు సినీ పరిశ్రమలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి...కామెడీ విలన్‌గా నవ్వులు కురిపించారు. ఆపై హీరోగా టర్న్ తీసుకొని ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో తనదైన నటన కనబరిచారు. శ్రీహరి ఈ పేరు చెబితే మంచి మంచి పాత్రలు గుర్తుకు వస్తాయి. పోలీస్ గా మొదలైన ఆయన హీరోయిజం.. ‘భద్రాచలం’, ‘గణపతి’, ‘అయోధ్యరామయ్య’, ‘విజయరామరాజు’ వంటి అనేక పాత్రల్లో రాణించింది. ‘నువ్వుస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. ఈ చిత్రంలో ఆయన నటనకుగానూ నంది అవార్డు సైతం వరించింది.శ్రీహరి 1986లో దర్శకదిగ్గజం దాసరి నారాయణ రావు తెరకెక్కించిన ‘బ్రహ్మనాయుడు’  ద్వారా తెరకు పరిచయమయ్యారు. దాసరి శిష్యులుగా చెప్పుకునే వారిలో శ్రీహరి అగ్రగణ్యుడు. కెరీర్ మొదట్లో చిన్న చిన్న  పాత్రలెన్నిటినో వేసి మెప్పించారు శ్రీహరి.

    అందులో భాగంగా అనేక చిత్రాల్లో ఆయన నటించారు. ‘ముఠామేస్త్రి’, ‘మేజర్ చంద్రకాంత్’,‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘అల్లరి ప్రియుడు’, ‘బావగారూ బావున్నారా’, ‘హలోబ్రదర్’ వంటి చిత్రాల్లో వేసింది చిన్న పాత్రలే అయినా.. ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నటించారు. వీటిలో ఎక్కువ శాతం కామెడీ విలనీ పండించి మంచి నటుడిగా పేరు సాధించారాయన.ఇక ప్రకాష్ రాజ్ విషయానికొస్తే..సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి పాత్రకైనా పాణం పెట్టి చేసే నటుడెవరంటే మనందరికి గుర్తుకు వచ్చే ముందు పేరు ప్రకాష్ రాజ్ దే. మోనార్క్ వంటి తండ్రైనా...బొమ్మరిల్లు ఫాదరైనా...దూకుడు వంటి నాన్న పాత్ర అయినా...పోకిరిలో విలన్ క్యారెక్టరైనా ప్రకాష్ రాజ్ నటన ముందు సలామ్ చేయాల్సిందే.

    Prakash Raj - Srihari Do You Know About Relation Between Prakash Raj Srihari,Prakash Raj - Srihari: ప్రకాష్ రాజ్, శ్రీహరి మధ్య ఉన్న బంధుత్వం తెలుసా.., Prakash Raj Srihari,Prakash Raj,Srihari,Prakash Raj Srihari Co Brothers,Prakash Raj Srihari Movie,Srihari Movie,Prakash Raj movies,tollywood,Telugu cinema, ప్రకాష్ రాజ్,శ్రీహరి,ప్రకాష్ రాజ్ శ్రీహరి,ప్రకాష్ రాజ్ శ్రీహరి సినిమాలు,ప్రకాష్ రాజ్ శ్రీహరి బంధుత్వం,శ్రీహరి బంధుత్వం
    శ్రీహరి, ప్రకాష్ రాజ్ (File/Photo)


    తెలుగులో యస్వీరంగారావు, సత్యనారాయణ, రావుగోపాలరావు, కోట శ్రీనివాస్ రావుల తర్వాత అంతటి క్రేజ్ సంపాదించిన వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్ యాక్టర్ ప్రకాష్ రాజ్. ఇటు వంటి ట్రాక్ రికార్డు వున్న ప్రకాష్ రాజ్ యాక్టింగ్ టాలెంట్‌ ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు... కోలీవుడ్, బాలీవుడ్ సహా అన్ని వుడ్లు ఫిదా అయ్యాయి.  ఇప్పటికే ఎన్నో జాతీయ అవార్డులను గెలుచుకున్న ప్రకాశ్ రాజ్‌లో  ఒక్క నటుడే కాదు..మంచి నిర్మాత, దర్శకుడు కూడా వున్నాడు.అటు విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా సత్తా చూపెట్టిన వీళ్లిద్దరి మధ్య బంధుత్వం ఉంది.

    Prakash Raj - Srihari Do You Know About Relation Between Prakash Raj Srihari,Prakash Raj - Srihari: ప్రకాష్ రాజ్, శ్రీహరి మధ్య ఉన్న బంధుత్వం తెలుసా.., Prakash Raj Srihari,Prakash Raj,Srihari,Prakash Raj Srihari Co Brothers,Prakash Raj Srihari Movie,Srihari Movie,Prakash Raj movies,tollywood,Telugu cinema, ప్రకాష్ రాజ్,శ్రీహరి,ప్రకాష్ రాజ్ శ్రీహరి,ప్రకాష్ రాజ్ శ్రీహరి సినిమాలు,ప్రకాష్ రాజ్ శ్రీహరి బంధుత్వం,శ్రీహరి బంధుత్వం
    శ్రీహరి, ప్రకాష్ రాజ్ (File/Photo)


    శ్రీహరి భార్య డిస్కో శాంతి.. ప్రకాష్ రాజ్ మొదటి భార్య లలిత కుమారి.. ఇద్దరు అక్కా చెల్లెలు. వీళ్ల నాన్న సి.ఎల్. ఆనంద్ .. కన్నడ, తమిళ, మలయాళ ఇండస్ట్రీలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటుడిగా, విలన్‌గా నటించి మెప్పించారు. ఈయన కూతుళ్లలో పెద్దమ్మాయి లలిత కుమారిని ప్రకాష్ రాజ్ పెళ్లి చేసుకున్నారు. రెండో అమ్మాయి డిస్కో శాంతిని శ్రీహరి ప్రేమ వివాహాం చేసుకున్నారు. ఈ రకంగా శ్రీహరి, ప్రకాష్ రాజ్ ఇద్దరు తోడల్లుళ్లు (సడ్డకులు) అయ్యారు. ఈ రకంగా వీళ్లిద్దరి మధ్య బంధుత్వం ఏర్పడింది. వీళ్లిద్దరు పలు సినిమాల్లో కలిసి నటించారు. బృందావనం సినిమాలో అన్నదమ్ములుగా నటించడం విశేషం. అంతేకాదు తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో వీళ్లిద్దరు నటించడం మరో విశేషం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: