మేడం టుస్సాడ్స్‌లో శ్రీదేవి మైనపు బొమ్మ.. బోనీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

సినీ నటి శ్రీదేవి

Sridevi Boney Kapoor: ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి, వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీన్ని రేపు సింగపూర్‌లోని మ్యూజియంలో ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు.

  • Share this:
    అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి, వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీన్ని రేపు సింగపూర్‌లోని మ్యూజియంలో ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. సినీ పరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గానూ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ సంద‌ర్భంగా శ్రీదేవి కుటుంబ స‌భ్యులు, అభిమానులు మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విషయాన్ని బోని కపూర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘శ్రీదేవి మా గుండెలోనే కాదు.. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సెప్టెంబరు 4న సింగపూర్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఆమె మైనపు బొమ్మను ఆవిష్కరించనున్నారు. ఆ సన్నివేశం కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్ చేశాడు.

    కాగా, గ‌తంలో బాలీవుడ్ నుంచి అమితాబ్, హృతిక్, ఐశ్వర్య, షారుక్, మాధురి దీక్షిత్ ఇలా చాలా మంది మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేసారు. ఇటీవ‌లే టాలీవుడ్‌ నుంచి మహేష్, ప్రభాస్ మైన‌పు బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు.

    Published by:Shravan Kumar Bommakanti
    First published: