SRIDEVI SODA CENTER 4 DAYS COLLECTIONS AND SUDHEER BABU HEADING TOWARDS ANOTHER FLOP PK
Sridevi Soda Center Collections: ‘శ్రీదేవి సోడా సెంటర్’ 4 డేస్ కలెక్షన్స్.. సుధీర్ బాబుకు తప్పని మరో ఫ్లాప్..
శ్రీదేవి సోడా సెంటర్ (Sridevi Soda Center collection)
Sridevi Soda Center Collections: సుధీర్ బాబు (Sudheer Babu) ఇమేజ్‌తో కొన్నిచోట్ల తొలిరోజు ‘శ్రీదేవి సోడా సెంటర్’ (Sridevi Soda Center Collections) సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఏపీలో ఇప్పటికీ మూడు షోలకు మాత్రమే అనుమతి ఉండటం.. కరోనా ఇంకా పోకపోవడంతో రెండో రోజు నుంచి వసూళ్లు దారుణంగా పడిపోయాయి.
సుధీర్ బాబు హీరోగా 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ తెరకెక్కించిన సినిమా 'శ్రీదేవి సోడా సెంటర్'. ఆనందో బ్రహ్మ, యాత్ర లాంటి సినిమాలు నిర్మించిన '70.ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఆగస్ట్ 27న విడుదలైన శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు తొలిరోజు టాక్ యావరేజ్‌గానే వచ్చింది. రొటీన్ ప్రేమకథకు కులం గొడవలు అంటించాడంతే అంటూ ప్రేక్షకులు తేల్చేసారు. అయితే సుధీర్ బాబు ఇమేజ్‌తో కొన్నిచోట్ల తొలిరోజు ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఏపీలో ఇప్పటికీ మూడు షోలకు మాత్రమే అనుమతి ఉండటం.. కరోనా ఇంకా పోకపోవడంతో పాటు తాజాగా వర్షాలు కూడా పడుతుండటంతో రెండో రోజు నుంచి దారుణంగా పడిపోయాయి శ్రీదేవి సోడా సెంటర్ కలెక్షన్స్. మరి ఈ సినిమా 4 రోజుల ఏరియా వైజ్ వసూళ్లను చూద్దాం..
ఈ సినిమాకు 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా సేఫ్ కావాలన్నా.. బయ్యర్లకు బ్రేక్ ఈవెన్ కావాలన్నా 8.2 కోట్లకు పైగానే షేర్ వసూలు చేయాలి. తొలిరోజు మంచి వసూళ్లు రావడంతో సినిమా నిలబడుతుందేమో అనుకున్నారు. కానీ రెండో రోజు నుంచి పరిస్థితులు మారిపోయాయి. చాలా చోట్ల దారుణంగా కలెక్షన్స్ పడిపోవడంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కంగారు మొదలైంది. ఆదివారంతో పాటు కృష్ణాష్టమి సెలవు రోజు కూడా యూజ్ చేసుకోలేకపోయింది ఈ చిత్రం. వీక్ డేస్‌లో సినిమా నిలబడే దాన్ని బట్టి సినిమా రేంజ్ అంచనా వేయొచ్చు. ప్రస్తుతానికి అయితే శ్రీదేవి సోడా సెంటర్ పరిస్థితి ఆశాజనకంగా మాత్రం లేదు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.