Sridevi - Rajababu : కమెడియన్ రాజబాబుకు అతిలోకసుందరి శ్రీదేవి జోడిగా నటించిన సినిమా ఏదో తెలుసా..

శ్రీదేవి, రాజబాబు (File/Photo)

Sridevi - Raja Babu : కమెడియన్ రాజబాబుకు అతిలోకసుందరి శ్రీదేవి జోడిగా నటించిన సినిమా ఏదో తెలుసా.. వీళ్లిద్దరు కలిసి ఓ సినిమాలో జోడిగా నటించారు.

 • Share this:
  Sridevi - Raja babu : కమెడియన్ రాజబాబుకు అతిలోకసుందరి శ్రీదేవి జోడిగా నటించిన సినిమా ఏదో తెలుసా.. వీళ్లిద్దరు కలిసి ఓ సినిమాలో జోడిగా నటించారు. వివరాల్లోకి వెళితే... రాజబాబు విషయానికొస్తే..  నవ్వు నాలుగు విధాల చేటు అనే సామెతను తుడిచేసి, నవ్వు నలభై విధాల గ్రేటు అని చాటిన ఘనుడు. ఆ బక్క పల్చని రూపం తెరపై కనపించగానే ప్రేక్షకుల ముఖాలు నవ్వులతో వికసిస్తాయి. కష్టాలు, కన్నీళ్లు అన్నీ మరచిపోతారు. నవ్వేందుకే ఈ జీవితం.. నవ్వొక్కటే శాశ్వతం అంటూ అందరినీ నవ్వించిన ఘనుడు రాజ బాబు. తనలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా.. బయటికి కనబడకుండా జనాన్ని నవ్వించారు. అందరినీ నవ్విస్తూ.. తన లాఫింగ్ తెరపీతో ఆరోగ్యాన్ని పంచిన వైద్యుడాయన. ఆయనే.. ప్రముఖ హాస్యనటరాజు రాజబాబు.

  అప్పట్లో ఈయన హీరోలతో సమానంగా పారితోషకం అందుకోని ఔరా అనిపించారు. ఈయన కమెడియన్‌గా ఉంటూనే పలువురు హీరోయిన్స్‌తో కూడా నటించారు. అందులో విజయ నిర్మల, వాణిశ్రీ, శ్రీదేవి వంటి వారున్నారు. ఇక శ్రీదేవితో ఈయన ఓ సినిమాలో కలిసి జోడిగా నటించారు. శ్రీదేవి విషయానికొస్తే..  తెలుగు తెరపైనే భారతీయ సినీ పరిశ్రమలో కథానాయికగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అతిలోకసుందరి శ్రీదేవి.

  Chiranjeevi Old Titles: ’రాజా విక్రమార్క’ సహా చిరంజీవి ఓల్డ్ టైటిల్స్‌తో వచ్చిన సినిమాలు ఇవే..

  బాలనటిగా ప్రవేశించి  ఆ తర్వాత హీరోయిన్‌గా మూడు తరాల హీరోలతో నటించి మెప్పించిన ఘనత శ్రీదేవి సొంతం. అంతేకాదు తెలుగుతో పాటు హిందీ, తమిళ్ వంటి చిత్ర సీమలో రెండు దశాబ్దాలకు పైగా నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ వంటి మూడు తరాల హీరోలతో రొమాన్స్ చేసి నిజంగానే అతిలోకసుందరి అనే బిరుదును సార్ధకం చేసుకుంది.

  Tollywood Brothers : సినీ ఇండస్ట్రీలో హీరోలుగా సత్తా చాటిన అన్నదమ్ములు.. నందమూరి టూ మెగా బ్రదర్స్..

  ఇక బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా అక్కడి అగ్ర హీరోల సరసన మెరిసింది. అంతేకాదు భారతీయ చిత్ర సీమను తన కనుసైగలతో శాసించింది శ్రీదేవి. అంతేకాదు మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్,రణ్‌బీర్ కపూర్ వంటి హీరోలకు ఈమెనే ఫేవరేట్ హీరోయిన్.

  Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

  భారతీయ చిత్ర పరిశ్రమలో వన్ అండ్ ఓన్లీ లేడీ సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి.. దాదాపు మూడేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో కన్నుమూసి అభిమానులను శోక సంద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.

  sridevi comedian raja babu act as hero heroins in these film,sridevi,sridevi raja babu,sridevi twitter,sridevi instagram,sridevi facebook,sridevi raja babu combination,sridevi raja babu jodi,sridevi raja babu devudulanti manishi,sridevi janhvi kapoor,tollywood,telugu cinema,శ్రీదేవి,రాజబాబు,శ్రీదేవి రాజ బాబు,శ్రీదేవి రాజబాబు జోడిగా దేవుడి లాంటి మనిషి,దేవుడి లాంటి మనిషి,రాజబాబు శ్రీదేవి దేవుడు లాంటి మనిషి
  శ్రీదేవి, రాజబాబు జంటగా నటించిన సినిమా (File/Photo)


  ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న శ్రీదేవి నటించిన హీరోల లిస్టులో ప్రముఖ కమెడియన్ రాజబాబు కూడా ఉన్నారు. కానీ ఈమె రాజబాబుకు జోడిగా నటించింది  హీరోయిన్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్న టైమ్‌లో కాదు. అపుడపుడే కథానాయికగా అడుగులు వేస్తోన్న శ్రీదేవి.. 1975లో కృష్ణ,మంజుల హీరో, హీరోయిన్లుగా నటించిన ‘దేవుడులాంటి మనిషి’ సినిమాలో శ్రీదేవి  రాజబాబు సరసన మెరిసింది.

  అప్పటి తరంలో శ్రీదేవి.. ఈ తరంలో కాజల్, తమన్నా..

  అంతేకాదు ఈ సినిమాలో రాజబాబుతో శ్రీదేవికి ఒక పాట కూడా ఉంది. ఈ రకంగా రాజబాబు సరసన నటించిన హీరోయిన్స్‌ లిస్ట్‌లో శ్రీదేవి కూడా నిలిచిపోయారు.  ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీస్‌లో ఉన్న అప్పటి అగ్ర హీరోల సరసన శ్రీదేవి నటించిన సంగతి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: