Sridevi - Hema: అతిలోకసుందరి శ్రీదేవికి డూప్‌గా హేమా నటించడం ఏమిటా అని ఆశ్యర్యపోతున్నారా అవును ఓ సినిమాలో హేమా శ్రీదేవికి డూప్‌గా నటించింది. వివరాల్లోకి వెళితే.. సినీ ఇండస్ట్రీలో హీరోలకు, హీరోయిన్లకు పలు సీన్స్‌లో డూప్‌లు నటించడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా రిస్కీ ఫైటింగ్ సన్నివేశాల్లో డూప్స్ ఎక్కువగా నటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒక హీరో రెండు పాత్రల్లో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేస్తే.. అందులో కథ ప్రకారం ఇద్దరు కనిపించే సన్నివేశాల్లో డూప్ అవసరం ఎక్కువగా ఏర్పడుతుంది. అప్పట్లో ఎన్టీఆర్ డూప్‌గా సత్యనారాయణ పలు సినిమాల్లో నటించారు. అంతేకాదు ఇద్దరు పర్సనాలిటీస్‌గా దాదాపు ఒకే రకంగా ఉంటాయి. ఈ రకంగా అప్పట్లో సత్యనారాయణ నటుడిగానే కాకుండా.. ఎన్టీఆర్ డూప్‌గా ఫేమస్ అయిపోయారు.
మరోవైపు నాగార్జున హీరోగా నటించిన ‘హలో బ్రదర్’ సినిమాలో శ్రీకాంత్ డూప్‌గా నటించారు. ఇక ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరు డూప్‌గా చిరంజీవి పర్సనల్ అసిస్టెంట్ సుబ్బారావుతో పాటు నటుడు హరిబాబు నటించారు. మరోవైపు ప్రశాంత్ హీరోగా నటించిన ‘తొలి ముద్దు’ సినిమాలో దివ్యభారతి డూప్‌గా రంభ నటించింది. అపుడు దివ్య భారతి ఆత్మ హత్య చేసుకోవడంతో రంభ అవసరం ఏర్పడింది. ఇక వెంకటేష్ డ్యూయల్ రోల్లో నటించిన కొన్ని సినిమాల్లో సురేష్ బాబు కూడా నటించిన సందర్భాలున్నాయి. ఇదే రూట్లో శ్రీదేవికి ఓ సన్నివేశంలో డూప్ అవసరం ఏర్పడింది. ఈ సందర్భంగా ఓ సినిమాలో శ్రీదేవికి బదులు హేమాను చూపించారు. ఆ సినిమా ఇంకేదో కాదు.. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించిన క్లాసిక్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. ఈ సినిమాలో ఓ సీన్‌లో భాగంగా శ్రీదేవి స్విమ్మింగ్ ఫూల్‌లో ఈత కొట్టే సీన్ ఉంటుంది. ఈ సందర్భంగా అమ్రిష్ పురి.. శ్రీదేవి కోసం వచ్చే సీన్ ఉంటుంది.
ఐతే.. స్వతహాగా శ్రీదేవికి స్విమ్ చేయడం రాదు. ఈత వచ్చిన అమ్మాయి కోసం వెతుకుతుండగా.. ఎవరు హేమ పేరు సిఫార్సు చేసారట. అప్పటికే హేమా .. జగదేకవీరుడు అతిలోకసుందరి షూటింగ్ జరుగుతున్న ఊటీలో మరో షూటింగ్‌లో ఉంది. దీంతో సదరు సినిమా వాళ్ల పర్మిషన్ తీసుకొని హేమను ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’లో శ్రీదేవి డూప్‌గా యాక్ట్ చేయడానికి తీసుకెళ్లారు. ఇపుడు ఈ సినిమాను జాగ్రత్తగా చూస్తే లాంగ్ షాట్‌లో హేమను గుర్తు పట్టవచ్చు. ఇక హేమ.. వెంకటేష్, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘క్షణ క్షణం’ సినిమాలో శ్రీదేవి ఫ్రెండ్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.