శ్రీదేవి మరణంపై సీబీఐ విచారణకు ఫ్యాన్స్ డిమాండ్

CBI Enquiry For Sridevi : అతిలోక సుందరి నటి శ్రీదేవి ప్రమాదవశాత్తూ బాత్ టబ్‌లో పడి 2018 ఫిబ్రవరి 24న చనిపోయిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: August 12, 2020, 4:07 PM IST
శ్రీదేవి మరణంపై సీబీఐ విచారణకు ఫ్యాన్స్ డిమాండ్
శ్రీదేవి Photo : Twitter
  • Share this:
అతిలోక సుందరి నటి శ్రీదేవి ప్రమాదవశాత్తూ బాత్ టబ్‌లో పడి 2018 ఫిబ్రవరి 24న  చనిపోయిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లోని ఓ హోటల్ గదిలో బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ శ్రీదేవి మునిగి చనిపోయింది. అయితే ఆమె మరణంపై అనేక అనుమానాలుఉన్నాయి అభిమానులకు. కారణం మొదట ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దుబాయ్ ఫోరెన్సిక్ అధికారులు లేదు.. ఆమె బాత్‌టబ్‌లో స్పృహలేని స్థితిలో పడి చనిపోయినట్లుగా ప్రకటించారు. అంతేకాదు ఆమె మృతిపై ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా క్షుణ్ణంగా విచారణ జరిగిందని అక్కడి అధికారవర్గాలు తెలిపాయి. అయితే ఆమె మరణంపై శ్రీదేవి అభిమానులకు మాత్రం అనుమానాలు అలానే ఉన్నాయి.
కాగా ఇటీవల హిందీ యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో.. ప్రస్తుతం సుశాంత్ మృతి కేసును సీబీఐ విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ అభిమాన నటి శ్రీదేవి మృతి కేసును కూడా ఎందుకు సీబీఐకి అప్పగించరని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఉద్యమం చేస్తున్నారు. #CBIEnquiryForSridevi అనే యాష్ ట్యాగ్‌‌ను ట్రెండ్ చేస్తూ.. శ్రీదేవి మరణంపై కూడా పలు అనుమానాలు ఉన్నాయని.. సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని.. సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
Published by: Suresh Rachamalla
First published: August 11, 2020, 9:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading