హోమ్ /వార్తలు /సినిమా /

Hyper Aadi: హైపర్ ఆది అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన పోలీస్ రియల్ పోలీసా? న్యూస్ వైరల్

Hyper Aadi: హైపర్ ఆది అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన పోలీస్ రియల్ పోలీసా? న్యూస్ వైరల్

హైపర్ ఆది అరెస్ట్

హైపర్ ఆది అరెస్ట్

హైపర్ ఆదిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీస్ రీల్ పోలీసు కాదు.. రియల్ పోలీస్. అతడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.

'హైపర్' ఆది బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరుకు స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. తెలుగు టీవీ ఛానల్స్, టీవీల్లో కామెడీ రియాలిటీ షోలు, ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళకు హైపర్ ఆది సుపరిచితుడు. అటు టీవీ షోలు చేస్తూ ఇటు సినిమాల్లోనూ కూడా నటిస్తున్నాడు. తాజాగా హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎక్కువగా కనిపిస్తున్నాడు. హైపర్ ఆది ప్రముఖ టీవీ ఛానెల్‌లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది అరెస్ట్ ఎపిసోడ్ పెద్ద సంచలనంగా మారింది. ప్రొమోలో ఆది అరెస్ట్ అయినట్లు చూపించి.. షోలో మాత్రం అదంతా స్కిట్‌లో భాగమేనని తేలిపోయింది.

ఇటీవలే ఈ షో ప్రోమో ఒకటి బాగా పాపులర్ అయ్యింది. నవ్వులతో సాగిన ఈ ప్రోమో క్లైమాక్స్‌లో అనుకోని ట్విస్ట్ ఇచ్చారు. చివరలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి హైపర్ ఆదిని అరెస్ట్ చేస్తారు. అనుకోని ఈ పరిణామానికి అక్కడున్నవారంతా షాక్ అవుతారు. కారు యాక్సిడెంట్ కేసులో ఆదిని అరెస్ట్ చేస్తున్నామని... అతని నిర్లక్ష్య డ్రైవింగ్‌కి ఒకరు చావు బతుకుల్లో ఉన్నారని పోలీసులు చెబుతారు. ఇక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.

ప్రోమో క్లైమాక్స్‌లో కనిపించే ఈ సీన్ చాలా ఇంటెన్స్‌గా కనిపించినప్పటికీ.. ఇదంతా వట్టి ప్రాంక్ అని ప్రేక్షకులు కొట్టి పారేశారు. షో ప్రమోషన్ కోసమే నకిలీ పోలీసులతో ఇలా చేయించారని అన్నారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఓ ట్విస్ట్ వచ్చింది. హైపర్ ఆది కోసం వచ్చి అరెస్ట్ చేస్తున్నామంటూ ఖాకీ డ్రెస్సులో భారీ డైలాగ్స్ వేసిన ఆయన నకిలీ పోలీస్ కాదు. అసలు పోలీసే. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఆయన స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

పోలీస్ అవ్వడానికి ముందు ఆయన ఓ రంగస్థల నటుడునని చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన పేరు మల్లికార్జున్ రావు. మల్లికార్జున్‌ది వరంగల్ జిల్లా మహబూబాబాద్. తన తండ్రి చాలా చమత్కారంగా మాట్లాడేవారంట. అలా తన తండ్రిని చూసి హావభావాలు బాగా కనిపెట్టేవారంట మల్లికార్జున్ రావు. వంద రూపాయలకు జూనియర్ ఆర్టిస్ట్‌గా కూడా ఆయన పనిచేశారు. నటించాలంటే తనకు చాలా ఇష్టమన్నారు మల్లికార్జున్. జబర్దస్త్ రాజమౌళి ద్వారా తనకు కామెడీ స్టార్స్‌లో నటించే అవకాశం వచ్చిందన్నారు. తనకున్న పాషన్‌తోనే షోల్లో నటిస్తున్నామన్నారు.

First published:

Tags: Hyper Aadi, Sridevi drama company

ఉత్తమ కథలు