Home /News /movies /

SRIDEVI DRAMA COMPANY LATEST PROMO GOING VIRAL ON SOCIAL MEDIA NR

Sridevi Drama Company: శ్రీదేవి డ్రామా కంపెనీలో వకీల్ సాబ్.. మాములు రచ్చ కాదుగా?

Sridevi Drama Company

Sridevi Drama Company

Sridevi Drama Company: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో సినిమాలో నటించి స్టార్ హీరోగా నిలిచాడు.

    Sridevi Drama Company: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో సినిమాలో నటించి స్టార్ హీరోగా నిలిచాడు. ఓ వైపు వెండితెరపై.. మరోవైపు రాజకీయాలపై సమాన బాధ్యతలు మోస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక కొన్ని రోజులు వెండితెరకు దూరంగా ఉన్న పవన్ మళ్లీ రీ ఎంట్రీ తో వరుస అవకాశాలు అందుకున్నాడు. ఇక ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ సినిమాతో ఎంత సక్సెస్ అందుకున్నాడో అందరికీ తెలిసిందే.

    ప్రస్తుతం ఎక్కడ చూసినా వకీల్ సాబ్ సినిమా టాకే వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా బుల్లితెర లో కూడా ఎంట్రీ ఇచ్చాడు వకీల్ సాబ్. ప్రస్తుతం బుల్లితెర లో ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు ప్రసారమవుతున్నాయి. ఇక బుల్లితెర ఆర్టిస్ట్ సుధీర్ యాంకరింగ్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి అందరికీ తెలిసిందే.

    ఇక ఈ షోలో ఎన్నో రకాల కళల్ని కూడా పరిచయం చేస్తూ ఉంటారు. ఎంతోమంది తమ స్కిట్ లతో, పర్ఫార్మెన్స్ తో తెగ సందడి చేస్తూ ఉంటారు. ఇందులో ఎంతో మంది ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. ఇక తాజాగా ఈ షో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో ఓ చిత్రకారుడు కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఇక ఆ ఆర్టిస్ట్ వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫోటో ను వేశారు. కేవలం నిమిషాల వ్యవధిలో ఫోటో వేయగా.. అక్కడున్న వాళ్ళంతా చూసి షాక్ అయ్యారు. ఇక సుధీర్ పవన్ కళ్యాణ్ ఫోటో చూసి గట్టిగా అరుస్తూ.. పవన్ కళ్యాణ్ స్టైల్ ను చూపిస్తూ అందరిని బాగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Latest promo, Social Media, Sridevi Drama Company, Telugu tv shows, Vakeel saab poster, Viral

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు