SRIDEVI DRAMA COMPANY LATEST PROMO EMMANUEL REVEALS WHO IS SRIDEVI MNJ
Sridevi Drama Company: శ్రీదేవి ఎవరో చెప్పేసిన ఇమ్మాన్యుల్.. షాక్‌లో అలీ
శ్రీదేవి డ్రామా కంపెనీ
Sridevi Drama Company: బుల్లితెరపై రియాలిటీ షోలకు మంచి డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్లు పోటీ పడి కొత్త కొత్త రియాలిటీ షోలను ప్లాన్ చేస్తున్నారు. ఇక స్పెషల్ ప్రోగ్రామ్‌లు, రియాలిటీ షోలు చేయడంలో ఎప్పుడూ ముందుండే ఈటీవీ ఇప్పుడు మరో సరికొత్త షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ పేరుతో ఈటీవీలో స్పెషల్ ప్రోగ్రామ్ రానుంది
Sridevi Drama Company: బుల్లితెరపై రియాలిటీ షోలకు మంచి డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్లు పోటీ పడి కొత్త కొత్త రియాలిటీ షోలను ప్లాన్ చేస్తున్నారు. ఇక స్పెషల్ ప్రోగ్రామ్‌లు, రియాలిటీ షోలు చేయడంలో ఎప్పుడూ ముందుండే ఈటీవీ ఇప్పుడు మరో సరికొత్త షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ పేరుతో ఈటీవీలో స్పెషల్ ప్రోగ్రామ్ రానుంది. ఇందులో భాగంగా ఒక్కో వారం ఒక్కో ఊరుకు వెళ్లనున్న నిర్వాహకులు.. అక్కడ ఉన్న లోకల్ టాలెంట్‌ని చూపించబోతున్నారు. ఇందులో డ్రామా కంపెనీ యజమాని గాలి గొట్టం గంగారావుగా నటుడు మధు, ఆయన కింద పనిచేసే పనోడి పాత్రలో జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుల్ ఉండగా.. అర్జున్ డ్రామా కంపెనీ యాంకర్‌గా చేయనున్నాడు. ఇక సంగీత, అలీ తదితరులు ఈ ప్రోగా్మ్కు గెస్ట్లుగా రాబోతున్నారు.
కాగా ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించిన ఇంతకుముందు విడుదల చేసిన ప్రోమోల్లో ఇంతకు శ్రీదేవి ఎవరు..? అన్న ప్రశ్నను వేశారు. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో అలీ కూడా అదే ప్రశ్నను వేశాడు. ఇంతకు శ్రీదేవి అని అలీ అడగ్గా.. ఇమ్మాన్యుల్ శ్రీదేవి పాటను పాడుతూ నేనే సర్ అంటాడు. నువ్వా..? అని అలీ అడగ్గా.. అవును సర్ నా పేరే శ్రీదేవి అని చెబుతాడు. దీంతో అలీ దూరం ఉండూ అని చెబుతాడు.
ఇక ఈ షో మొదటి ఎపిసోడ్‌కి సంబంధించి విజయనగరంలో చేశారు. ఇందులో హ్యూమన్ కంప్యూటర్‌గా రికార్డులకెక్కిన భానుతో పాటు చాందినీ అనే రికార్డు డ్యాన్సర్ కూడా పాల్గొన్నారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ ప్రోగ్రామ్ ఈటీవీలో ప్రసారం కానుంది. ఇది చూస్తుంటే ఈటీవీ వీక్షకులు మరో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్‌తో మరింత ఎంటర్టైన్ అవ్వబోతున్నట్లు అర్థమవుతోంది.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.