2018 ఫిబ్రవరి 24న అతిలోకసుందరి శ్రీదేవి అకాల మరణ వార్త యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. బంధువుల పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన ఒక హోటల్ బాత్‌రూమ్ టబ్‌లో ప్రమాదవశాత్తు పడి కన్నుమూసారు. ఆమె హఠాన్మరణంతో ఫ్యామిలీ సభ్యులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే శ్రీదేవి మరణానికి సంబంధించిన అసలు కారణాలను ప్రముఖ రచయత సత్యర్ధి నాయక్ వెల్లడించారు. ఈయన శ్రీదేవి జీవితంపై బయోగ్రఫీ పుస్తకం రాసాడు. అందులో శ్రీదేవి మరణానికి గల కారణాలు ఏంటో వెల్లడించాడు. ఈ సందర్భంగా ఆయన శ్రీదేవి కుటుంబ సభ్యులతో పాటు ఆమెకు సన్నిహితులైన సినిమావాళ్లను ప్రశ్నించిగా వచ్చిన సమాచారంతో ఆమె మరణానికి కారణాలను వెల్లడించాడు. తాజాగా ఈ విషయాన్ని ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. శ్రీదేవికి ముందు నుంచి ‘లో బీపీ’ ఉండేదని.. అపుడపుడు షూటింగ్ జరిగేటపుడు కళ్లు తిరిగి పడ్డ సందర్భాలున్నాయని శ్రీదేవితో ‘చాల్‌బాజ్’ చిత్రాన్ని తెరకెక్కించిన పంకజ్ పరాషర్ తనతో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు సత్యార్ధి నాయక్.
మరోవైపు హీరో నాగార్జున కూడా శ్రీదేవి తనతో ఓ సారి షూటింగ్‌లో జరిగేటపుడు ఓసారి బాత్రూమ్‌లో పడిపోయిన సందర్భాన్ని తనతో ప్రస్తావించినట్టు నాయక్ వెల్లడించాడు. మరోవైపు శ్రీదేవి కజిన్.. మహేశ్వరి, భర్త బోనీ కపూర్ కూడా శ్రీదేవి ఒక్కోసారి వాకింగ్ చేసేటపుడు కుప్పకూలిన సందర్భాలున్నాయన్నాయన్నారు. ఆమె లో బీపీ విషయాన్ని డాక్టర్లకు చూపించినా ప్రయోజనం లేకపోయిందన్న విషయం కుటుంబ సభ్యులు తెలిపారు. మొతానికి శ్రీదేవి మరణానికి తక్కువ రక్తపోటు అదే లో బీపీ కారణమనే విషయం ఈ సంఘటనలతో స్పష్టమైందన్నారు సదరు రచయత.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Hindi Cinema, Sridevi, Telugu Cinema, Tollywood