అతిలోకసుందరి శ్రీదేవి గురించి సెపెరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. బాలనటిగా ప్రవేశించి ఆ తర్వాత హీరోయిన్‌గా మూడు తరాల హీరోలతో నటించి మెప్పించిన ఘనత శ్రీదేవి సొంతం. అంతేకాదు తెలుగుతో పాటు హిందీ, తమిళ్ వంటి చిత్ర సీమలో రెండు దశాబ్దాలకు పైగా నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ వంటి మూడు తరాల హీరోలతో రొమాన్స్ చేసి నిజంగానే అతిలోకసుందరి అనే బిరుదును సార్ధకం చేసుకుంది. ఇక బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా అక్కడి అగ్ర హీరోల సరసన మెరిసింది. అంతేకాదు భారతీయ చిత్ర సీమను తన కనుసైగలతో శాసించింది శ్రీదేవి. అంతేకాదు మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్,రణ్‌బీర్ కపూర్ వంటి హీరోలకు ఈమెనే ఫేవరేట్ హీరోయిన్. ఇండియన్ వన్ అండ్ ఓన్లీ లేడీ సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి.. రెండేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో కన్నుమూసి అభిమానులను శోక సంద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.
ఇలాంటి ట్రాక్ రికార్డు శ్రీదేవి నటించిన హీరోల లిస్టులో ప్రముఖ కమెడియన్ రాజబాబు కూడా ఉన్నాడు. కానీ ఈమె రాజబాబుకు జోడిగా నటించింది హీరోయిన్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్న టైమ్‌లో కాదు. అపుడపుడే కథానాయికగా అడుగులు వేస్తోన్న శ్రీదేవి.. 1975లో కృష్ణ,మంజుల హీరో, హీరోయిన్లుగా నటించిన ‘దేవుడులాంటి మనిషి’ సినిమాలో శ్రీదేవి రాజబాబు సరసన మెరిసింది. అంతేకాదు ఈ సినిమాలో రాజబాబుతో శ్రీదేవికి ఒక పాట కూడా ఉంది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీస్‌లో ఉన్న అప్పటి అగ్ర హీరోల సరసన శ్రీదేవి నటించిన సంగతి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.