SRI REDDY WANTS TO PAWAN KALYAN TO PLAY HORROR MOVIE HERE ARE THE DETAILS TA
పవన్ కళ్యాణ్‌తో అలాంటి సినిమా చేయాలంటున్న శ్రీరెడ్డి..
శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ (File Photo)
జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వివాదాస్పద నటి శ్రీరెడ్డి మొదటి నుంచి టార్గెట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజగా శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్‌తో ఎలాంటి సినిమా చేయాలో మనసులో మాట బయటపెట్టింది.
జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వివాదాస్పద నటి శ్రీరెడ్డి మొదటి నుంచి టార్గెట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమెకు అనుకూలంగా మాట్లాడలేదనే కోపంతో ఇప్పటికీ పవన్‌పై ఆమె విషం కక్కుతూనే ఉంది. పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. సోషల్ మీడియాలో శ్రీ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఆమె చేసిన పోస్టులు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. రీసెంట్‌గా జనసేన పార్టీని అమ్మేస్తున్నారటేగా అంటూ పోస్ట్ సంచలన పోస్ట్ చేసింది. మీ అన్నయ్య ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్టే.. జనసేన పార్టీని అమ్మేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా శ్రీరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో అలాంటి సినిమా చేయాలంటూ తన మనసులో మాటలు బయటపెట్టింది.
శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ (File Photo)
తాజాగా శ్రీరెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను మెచ్చుకుంది. చిరు నటించాడు కాబట్టి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా సూపర్ హిట్టైయింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేసుంటే..అట్టర్ ఫ్లాప్ అయ్యేండేదని వ్యాఖ్యానించింది. అంతేకాదు పవన్ కళ్యాణ్‌తో ఏదైనా దెయ్యం సినిమా తీయిస్తే బెటర్ అంటూ వ్యాఖ్యానించింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.