కాంట్రవర్సీలకు పెట్టింది పేరు శ్రీ రెడ్డి. ఎప్పుడు ఎవర్నో ఒకర్ని కెలికితే తప్ప ఈమెకు నిద్ర పట్టదు. ఊరికే ఉండటం అసలు ఈమె హిస్టరీలోనే లేదు. ఎవరని చూడకుండా అందర్నీ టార్గెట్ చేస్తుంది శ్రీ రెడ్డి. అందులో పవన్ కళ్యాణ్ ఎక్కువ సార్లు ఈమెకు బలైపోతుంటాడు పాపం. దాంతో పాటు మధ్యలో కూడా పిచ్చిపిచ్చి కామెంట్స్ కూడా పెడుతుంటుంది శ్రీ రెడ్డి. ప్రపంచం మొత్తం భయపడుతున్న కరోనాను అంతం చేయడానికి సెక్స్ చేయడమే మార్గం అంటూ ఆ మధ్య ఈమె చేసిన పోస్ట్ వైరల్ అయిపోయింది. ఆ తర్వాత అమలా పాల్‌ను కూడా టార్గెట్ చేసింది. ఇక ఇప్పుడు ఈమె సమంత, త్రిషలను టార్గెట్ చేసింది.
వాళ్లే లక్ష్యంగా పోస్టులు పెట్టింది. దాంతో వాళ్ల ఫ్యాన్స్ శ్రీ రెడ్డిని టార్గెట్ చేసుకుని మండి పడుతున్నారు. సమంత, త్రిషలను లక్ష్యంగా చేసుకుని కొన్ని వల్గర్ పోస్టులు పెట్టింది శ్రీ రెడ్డి. అది చూసి ఆమె అభిమానులు ఈమెను తిడుతున్నారు. నువ్వు ఈ జీవితంలో ఇంక మారవ్ కదా.. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తుంటావు.. ఎవరో ఒకర్ని టార్గెట్ చేస్తావ్.. ముందు నీకు నువ్వు సరిగ్గా ఉండటం నేర్చుకో అంటూ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ సమంత, త్రిషను అంతగా ఏమంది అనుకుంటున్నారా..?
సమంత, త్రిష శరీర అవయవాలపై నీచమైన కామెంట్స్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. ఇది చూసిన తర్వాత అభిమానులే కాదు.. సాటి ఆడవాళ్లు కూడా ఈమె తాట తీయాలన్నంత కోపంతో రగిలిపోతున్నారు. తన అవయవ సంపద ముందు ముందు సమంత, త్రిష దిగదుడుపే అంటూ హాట్ ఫోటో షేర్ చేసింది శ్రీ రెడ్డి. ఏదేమైనా కూడా నోరు, చేయి అస్సలు ఊరుకోకుండా ఎప్పుడూ ఏదో ఓ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూనే ఉంటుంది ఈమె. మరి దీనికి అంతం ఎక్కడుందో ఎవరికి తెలుసో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samantha akkineni, Sri Reddy, Telugu Cinema, Tollywood, Trisha