పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి..

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ (Pawan Kalyan Renu Desai)

ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య శ్రీ రెడ్డి కాస్త శాంతించింది. ఎప్పుడూ చిందులు తొక్కే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం కాస్త కామ్ అయిపోయింది. అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ చెప్పినట్లు గతంలో పోలిస్తే..

  • Share this:
ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య శ్రీ రెడ్డి కాస్త శాంతించింది. ఎప్పుడూ చిందులు తొక్కే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం కాస్త కామ్ అయిపోయింది. అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ చెప్పినట్లు గతంలో పోలిస్తే ఇప్పుడు కోపం చాలా తగ్గించుకుంది శ్రీ రెడ్డి. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ మెసేజ్‌లు పోస్ట్ చేస్తూ తనలోని మార్పు చూపిస్తుంది ఈ కాంట్రవర్సీ క్వీన్. అయితే కారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసినా కూడా లోపల మాత్రం ఒరిజినల్ అలాగే ఉంటుంది. అందుకే అప్పుడప్పుడూ అది బయటికి వచ్చి నానా రచ్చ చేసి వెళ్తుంటుంది. ఇప్పుడు కూడా మరోసారి ఇదే జరిగింది.

Sri Reddy targeted Renu Desai and posted a controversial statement over her personal life pk ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య శ్రీ రెడ్డి కాస్త శాంతించింది. ఎప్పుడూ చిందులు తొక్కే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం కాస్త కామ్ అయిపోయింది. అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ చెప్పినట్లు గతంలో పోలిస్తే.. renu desai,sri reddy,sri reddy facebook,sri reddy twitter,sri reddy instagram,sri reddy renu desai,sri reddy renu desai divorce,pawan kalyan renu desai,pawan renu desai divorce,telugu cinema,sri reddy pawan kalyan,sri reddy pawan war,controversy sri reddy,శ్రీ రెడ్డి,పవన్ కల్యాణ్,రేణు దేశాయ్,పవన్ రేణు దేశాయ్ విడాకులు,పవన్ కల్యాణ్ రేణు దేశాయ్ శ్రీ రెడ్డి,తెలుగు సినిమా
శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ (File Photo)


రజినీకాంత్ గారూ హ్యాపీ బర్త్ డే.. దీపిక పదుకొనే చపాక్ ట్రైలర్ బాగుంది అంటూ పాజిటివ్ కమెంట్స్ చేసి కొన్ని గంటలు కూడా గడవకముందే రేణు దేశాయ్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది శ్రీ రెడ్డి. పవన్ కల్యాణ్ మాజీ భార్య కావడంతో శ్రీ రెడ్డి చేసే కామెంట్స్ కచ్చితంగా ఆయన్ని టార్గెట్ చేసేవిగానే ఉంటాయి. పైగా రేణు కూడా ఈ మధ్య పవన్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆమె తన సొంత లైఫ్ లీడ్ చేస్తుంది. ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు దర్శకురాలిగానూ మారాలని చూస్తుంది రేణు. ఈ మధ్య దిశ ఎపిసోడ్ గురించి కూడా కొన్ని సంచలన కామెంట్స్ చేసింది రేణు.

ఈ క్రమంలోనే ఈమెపై కొన్ని వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది శ్రీ రెడ్డి. రేణు దేశాయ్ గారూ బెస్ట్ ఆఫ్ లక్.. మీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నా.. మీరు ఓ నరకం నుంచి బయటికి వచ్చారంటూ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. ఈమె చేసిన కామెంట్స్ మళ్ళీ పవన్‌ను టార్గెట్ చేసే విధంగానే ఉన్నాయి. దాంతో పవన్ అభిమానులతో శ్రీ రెడ్డి యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు రేణు దేశాయ్‌ను సైతం మధ్యలోకి తీసుకురావడం వెనక శ్రీ రెడ్డి అంతరార్థం ఏంటో ఎవరికి అంతుచిక్కడం లేదు. ఏదేమైనా కూడా ఎవరో ఒకర్ని టార్గెట్ చేయకపోతే కనీసం తిన్న అన్నం కూడా శ్రీ రెడ్డికి అరిగేలా కనిపించడం లేదంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.
Published by:Praveen Kumar Vadla
First published: