SRI REDDY TARGETED BOYAPATI SRINU ALONG WITH JABARDASTH JUDGE MLA ROJA AND PAWAN KALYAN IN FACEBOOK PK
బోయపాటి శ్రీను వైపు దూసుకొచ్చిన శ్రీ రెడ్డి బాణం.. ఆమెతో మీకు అంటూ..
శ్రీరెడ్డి,బోయపాటి శ్రీను (Facebook/Photo)
చాలా రోజుల తర్వాత శ్రీ రెడ్డి మళ్లీ వచ్చింది. కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ చాన్నాళ్ల తర్వాత రెచ్చిపోయింది. ఏ మాత్రం సిగ్గు పడకుండా మరోసారి సిగ్గు విడిచి స్టేట్మెంట్స్ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి.
చాలా రోజుల తర్వాత శ్రీ రెడ్డి మళ్లీ వచ్చింది. కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ చాన్నాళ్ల తర్వాత రెచ్చిపోయింది. ఏ మాత్రం సిగ్గు పడకుండా మరోసారి సిగ్గు విడిచి స్టేట్మెంట్స్ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. మొన్నటికి మొన్న జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్స్ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. ఇక ఇప్పుడు వీటిని మరిచిపోకముందే నటి, ఎమ్మెల్యే రోజాతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీనును కూడా టార్గెట్ చేసింది. వరసగా వాళ్లపై వివాదాస్పద పోస్టులు పెడుతూ ఫేస్ బుక్కులో హోరెత్తించింది.
వైసీపీ ఎమ్మెల్యే నటి రోజాపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు (facebook/Photo)
వీటిని చూసిన తర్వాత ఎప్పట్లాగే శ్రీ రెడ్డిని నరికేస్తాం అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కానీ తాను మాత్రం చేయాల్సిందంతా చాలా కూల్‌గా చేస్తుంది శ్రీ రెడ్డి. ఈ మధ్యే పవన్ వెన్ను నొప్పిపై సంచలన పోస్టులు పెట్టింది శ్రీ రెడ్డి. పవన్‌కి వెన్నుపూస గాయాలంట కదా.. పాపం --- పని చేస్తుందో లేదో.. ఇప్పటికే చాలా వాడేసాడు.. అరిగిపోయుంటుంది అంటూ మాటల్లో కూడా చెప్పలేని విధంగా దారుణమైన కామెంట్స్ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. ఇక ఇప్పుడు బోయపాటి శ్రీనుపై కూడా నోటితో చెప్పలేని విధంగా పోస్ట్ చేసింది ఈమె.
ఇండస్ట్రీలో ఉన్న ఓ కారెక్టర్ ఆర్టిస్టుతో బోయపాటికి లింక్ పెడుతూ.. మీ ఎఫైర్ సంగతేంటి బోయపాటి గారూ అంటూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. ఈటీవీలో వచ్చే ఓ నటి.. ఆమె భర్తపై కూడా కాంట్రవర్సీ పోస్టులు చేసింది ఈ భామ. ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌తో ఎలాంటి పోస్ట్ పెట్టినా కూడా క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. ఇప్పుడు బోయపాటి, రోజా, ఆ నటిపై చేసిన కామెంట్స్ కూడా ఇలాగే వైరల్ అయిపోతున్నాయి. మొత్తానికి మరి ఈ రచ్చకు శ్రీ రెడ్డి ఎక్కడ ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.