హోమ్ /వార్తలు /సినిమా /

Naga Chaitanya - Samantha : సంసారం అన్నాకా సర్ధుకుపోవాలి.. సమంతకు శ్రీ రెడ్డి సూచన..

Naga Chaitanya - Samantha : సంసారం అన్నాకా సర్ధుకుపోవాలి.. సమంతకు శ్రీ రెడ్డి సూచన..

సమంత, నాగ చైతన్య దంపతులకు శ్రీరెడ్డి సూచన (File/Photo)

సమంత, నాగ చైతన్య దంపతులకు శ్రీరెడ్డి సూచన (File/Photo)

Sri Reddy - Naga Chaitanya - Samantha : సంసారం అన్నాకా సర్ధుకుపోవాలి.. సంసారంలో సరిగమలు కామన్ అంటూ  సమంతకు శ్రీ రెడ్డి చేసిన సూచన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  Sri Reddy - Naga Chaitanya - Samantha : సంసారం అన్నాకా సర్ధుకుపోవాలి.. సంసారంలో సరిగమలు కామన్ అంటూ  సమంతకు శ్రీ రెడ్డి చేసిన సూచన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొన్నేళ్లుగా మీడియాలో సమంత, అక్కినేని నాగ చైతన్య విడిపోతున్నారా  అనే విషయం హాట్ టాపిక్‌‌గా మారింది. రీసెంట్‌గా సమంత.. తన సోషల్ మీడియా అకౌంట్‌లో అక్కినేని పేరు తొలిగించడంతో వీళ్లిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్టు మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు సమంత విహార యాత్రలకు భర్తతో కాకుండా.. తన స్నేహితురాలితో కలిసి వెళ్లడంతో దీనికి మరింత బలం చూకూర్చినట్టైయింది.  వీరి విడాకుల గురించి ఇండస్ట్రీలో ఇంత హాట్ టాపిక్ గా మారిన కూడా అక్కినేని కుటుంబం కానీ సమంత కానీ ఇప్పటివరకు ఈ విషయం గురించి స్పందించలేదు.

  అంతేకాదు.. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. అయితే ఈ సూపర్ సక్సెస్ అవ్వడంతో సక్సెస్ మీట్ పెట్టగా అక్కినేని నాగార్జున ఇంటా డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీకి సమంత రాకపోవడంతో విడాకుల వార్తలకు మరింత ఆజ్యం పోసినట్టైయింది.

  Super Star Krishna : అప్పట్లోనే సూపర్ స్టార్ కృష్ణ చేసిన ఈ సూపర్ హిట్ సీక్వెల్ మూవీ తెలుసా..

  ఇలా వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొద్దిరోజుల నుంచి వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో రోజురోజుకు వీరి గురించి వస్తున్న వార్తల వల్ల తనకు తన భర్త నాగచైతన్యకు పరువు నష్టం కలుగుతుందని,ఇప్పటికీ ఈ విషయంపై సైలెంట్ గా ఉంటే మరిన్ని దిగజారిన వార్తలు రాస్తారని ఈ వార్తలకు అడ్డుకట్ట వేయడం కోసం సమంత కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు.

  James Bond Heroes: సిల్వర్ స్క్రీన్ పై జేమ్స్ బాండ్‌గా ఇరగదీసిన హీరోలు వీళ్లే..

  అంతేకాదు ఈ విషయమై సమంత మాట్లాడుతూ.. తనకు హైదరాబాదే సొంత ఇల్లు అంటూ వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు తనకు నాగ చైతన్య మధ్య ఎలాంటి ఇష్యూస్ లేవంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ అభిమానులు మాత్రం వీళ్లిద్దరు కలిసి ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే కామెంట్స్ అక్కినేని అభిమానుల నుంచి వస్తోంది.

  బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..

  తాజాగా సమంత, నాగ చైతన్య విడాకుల విషయమై నటి శ్రీరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలను చేసారు. మీరిద్దరు కలిసుండాలనేది నాతో పాటు అభిమానుల కోరిక. మీరు ఎంతో మందికి స్పూర్తి కలిగించే భార్యాభర్తల్లా ఉండాలకుంటున్నాం. మిమ్మిల్ని చూసి ఎంతో మంది స్పూర్తి పొందుతారంది. ఏమైనా జీవితం అన్నాకా సర్ధుబాటు ఉండాాలి. భార్యభర్తలన్నకా సంసారంలో సరిగమలుంటాయి. కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఈగో, ఆటిట్యూట్స్ అనేవి కామన్. ఒక స్త్రీగా సమంతనే సర్ధుకుపోవాల్సి ఉంటుంది. సమంత వదిన మీరు, మా అన్నయ్య ఎప్పటికీ కలిసుండాలున్నారు.

  ఓ అమ్మాయికి ఓపిక అనేది ఎక్కువగా ఉండాలనేది మన భారతీయ సంప్రదాయం మనకు నేర్పించింది. కొన్ని విషయాల్లో సమంత సర్ధుకుపోతేనే అంతా బాగుంటుందన్నారు. అంతా వారిద్దరి సంసారం బాగుండాలని కోరుకుంటున్నాను. అంతేకాదు త్వరలో తన పెళ్లి అయ్యిపోవాలని ఆశీర్వదించండి అంటూ కోరింది. ఆ తర్వాత వద్దు వద్దు నాకు ఈ కొట్టుకోవడాలు.. తిట్టుకోవడాల నా వల్ల కాదంటూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Naga Chaitanya Akkineni, Samantha akkineni, Sri Reddy, Tollywood

  ఉత్తమ కథలు