Video: శ్రీరెడ్డి పోస్ట్ చేసిన వీడియో చూస్తే షాక్ కొట్టడం ఖాయం...

సుమారు 60 లక్షల మంది ఫాలోయర్లు ఉన్న శ్రీరెడ్డి ఫేస్ బుక్ పేజ్ మీద ఈ వీడియోను చాలామంది చూశారు.

news18-telugu
Updated: January 19, 2020, 8:37 PM IST
Video: శ్రీరెడ్డి పోస్ట్ చేసిన వీడియో చూస్తే షాక్ కొట్టడం ఖాయం...
శ్రీరెడ్డి (Facebook)
  • Share this:
ఎప్పుడూ వివాదాల్లో ఉంటూ, అప్పుడప్పుడు కొన్ని సరదా పనులు, సామాజిక సందేశాలతో కనిపిస్తూ ఉంటుంది శ్రీరెడ్డి ఫేస్ బుక్ పేజ్. శ్రీరెడ్డి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే మీ గుండెల్లో భయం పుట్టడం ఖాయం. కచ్చితంగా వామ్మో అని అంటారు. ఆ వీడియోలో ఏముందంటే... ఓ ముసలి వ్యక్తి ఆస్పత్రి బెడ్ మీద ఉన్నాడు. మరో వ్యక్తి అతడి నోరు తెరిచి చూపిస్తాడు. ఆ వృద్ధుడి పై పళ్ల మీద తెల్లటి పురుగులు కదులుతుంటాయి. ఆ వీడియో చూస్తే గుండె ఝల్లుమనడం ఖాయం. 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను పోస్ట్ చేసిన శ్రీరెడ్డి... పైన ఓ సందేశాన్ని కూడా పోస్ట్ చేసింది. ‘మనం అందరం వృద్ధులం అవుతాం. కొందరికి మాత్రమే ఇలాంటి పరిస్థితి వస్తుంది. అందులో పెద్దవాళ్లు ఉండొచ్చు. సెలబ్రిటీలు కూడా ఉండొచ్చు. నిజాయితీతో జీవితాన్ని గడపండి. దేవుడికి కృతజ్ఞతతో ఉండండి. డబ్బేసర్వస్వం కాదు.’ అని పోస్ట్ చేసింది.



సుమారు 60 లక్షల మంది ఫాలోయర్లు ఉన్న శ్రీరెడ్డి ఫేస్ బుక్ పేజ్ మీద ఈ వీడియోను చాలామంది చూశారు. అయితే, ఇది నిజమైన వీడియో కాదంటూ ఫేస్ బుక్ సంస్థ ఆ వీడియో మీద కామెంట్ పెట్టింది. ఓ స్వతంత్ర సంస్థతో నిజ నిర్దారణ చేయించినట్టు తెలిపింది.

First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు