అల్లు అర్జున్‌పై శ్రీ రెడ్డి కామెంట్స్.. కనీసం జీవితంలో ఒక్కసారైనా..

అల్లు అర్జున్ శ్రీ రెడ్డి (Source: Twitter)

శ్రీ రెడ్డి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఎవరో ఒకర్ని టార్గెట్ చేసి నానా మాటలు అనేస్తుంటుంది. తనకు తాను ఇది కరెక్ట్ అని చెప్పుకుంటున్నా కూడా చూసే వాళ్లకు మాత్రం..

  • Share this:
శ్రీ రెడ్డి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఎవరో ఒకర్ని టార్గెట్ చేసి నానా మాటలు అనేస్తుంటుంది. తనకు తాను ఇది కరెక్ట్ అని చెప్పుకుంటున్నా కూడా చూసే వాళ్లకు మాత్రం ఎందుకో ఆమె ఎప్పుడూ తప్పుగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే ఎప్పుడూ శ్రీ రెడ్డిపై ఫైర్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసింది ఈమె. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏంటంటే తాజాగా జరిగిన అల వైకుంఠపురములో మ్యూజికల్ నైట్‌లో బన్నీ కనిపించిన తీరుపై మండిపడింది శ్రీ రెడ్డి.

ఎప్పుడూ మనుషులను టార్గెట్ చేసే ఈమె ఇప్పుడు మాత్రం వెరైటీగా అల్లు అర్జున్ హెయిర్ స్టైల్‌ను లక్ష్యంగా చేసుకుని సెటైర్లు వేసింది. అల్లు అర్జున ఎప్పటికైనా నీ ఒరిజినల్ హెయిర్‌తో సినిమాల్లో వస్తావా.. ఎప్పుడూ ఎక్స్‌టెన్షన్ విగ్గులేనా.. అంటూ పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. ఈమె ఫేస్‌బుక్ పోస్ట్ చూసి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అక్కడితో ఆగకుండా అల్లు అర్జున్ ఆర్మీ శ్రీ రెడ్డిని ఆడుకుంటున్నారు. ఎప్పుడూ ఎవరో ఒకర్ని టార్గెట్ చేస్తూ ఇలా చేస్తూనే ఉంటావా అంటూ ఆమెపై విరుచుకుపడుతున్నారు ఫ్యాన్స్.

Sensational Sri Reddy controversial comments on Allu Arjun car and Kerala Floods pk శ్రీ రెడ్డి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఎవరో ఒకర్ని టార్గెట్ చేసి నానా మాటలు అనేస్తుంటుంది. తనకు తాను ఇది కరెక్ట్ అని చెప్పుకుంటున్నా కూడా చూసే వాళ్లకు మాత్రం.. allu arjun,allu arjun twitter,allu arjun facebook,allu arjun sri reddy,allu arjun sri reddy comments,sri reddy comments on allu arjun,allu arjun movies,allu arjun sri reddy war,sri reddy twitter,sri reddy facebook,allu arjun beast,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి కమెంట్స్,అల్లు అర్జున్ శ్రీ రెడ్డి వార్,తెలుగు సినిమా
అల్లు అర్జున్ కార్ (Source: Twitter)


బన్నీని ఈమె టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ చేసింది. అప్పట్లో బన్నీ ఓ కార్ కొన్నాడు. దీన్ని తన ఇంటి మెంబర్ అని పరిచయం చేసాడు అల్లు అర్జున్. దీనికి బీస్ట్ అనే పేరు కూడా పెట్టాడు బన్నీ. అయితే ఈయన కార్ కొనడం శ్రీ రెడ్డికి నచ్చలేదు. అస్సలు నచ్చలేదు.. ఎంతలా అంటే మళ్లీ సోషల్ మీడియాలో నానా రచ్చ చేసేంతగా. ఈయన కార్ కొనడంతో కారు కూతలు కూసింది శ్రీ రెడ్డి. కార్ కొన్నందుకు కంగ్రాట్స్ చెప్తూ.. మరోవైపు సెటైర్లు కూడా వేసింది ఈ బ్యూటీ. ముఖ్యంగా బన్నీ బీస్ట్‌పై శ్రీ రెడ్డి కళ్లు పడ్డాయి. కోట్లు పెట్టి కొన్నావ్ కదా.. మరి నిన్ను అభిమానించిన కేరళ వాళ్లకు వరదలు వస్తే ఏం చేసావంటూ బన్నీని నిలదీసింది ఈ ముద్దుగుమ్మ.

కోట్లు విలువచేసే కారవాన్, రేంజ్ రోవర్ కార్లను కొన్నావు కాని.. కేరళ వరద బాధితులకు ఎంత సాయం చేశావ్.. అక్కడ నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా.. నువ్ వాళ్లకు హెల్ప్ చేస్తావని భావిస్తున్నా అంటూ అప్పట్లో శ్రీ రెడ్డి పెట్టిన పోస్ట్ సంచలనమైంది. కానీ అప్పటికే బన్నీ తనదైన సాయం కేరళకు చేసాడు బన్నీ. 25 లక్షల వరకు ఆయన అప్పట్లో విరాళం అందించాడు. ఇప్పుడు మరోసారి ఈయన హెయిర్ స్టైల్‌పై పడింది శ్రీ రెడ్డి. మొత్తానికి చూడాలిక.. శ్రీ రెడ్డి, బన్నీ వార్ ఎంతదూరం వెళ్లనుందో..?
Published by:Praveen Kumar Vadla
First published: