పవన్‌పై శ్రీ రెడ్డి సంచలన పోస్ట్.. ‘దిశ’ నిందితుల్లా ఎన్‌కౌంటర్ చేయాలంటూ..

శ్రీ రెడ్డి.. ఎవరు ఏమైపోయినా తన ఫ్లోలో తను ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేయాలా.. టార్గెట్ చేయడానికి ఏ అంశం దొరుకుతుందా అని వేచి చూస్తుంది ఈ బ్యూటీ. ఇప్పుడు కూడా దేశమంతా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 6, 2019, 9:24 PM IST
పవన్‌పై శ్రీ రెడ్డి సంచలన పోస్ట్.. ‘దిశ’ నిందితుల్లా ఎన్‌కౌంటర్ చేయాలంటూ..
శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ (File Photo)
  • Share this:
శ్రీ రెడ్డి.. ఎవరు ఏమైపోయినా తన ఫ్లోలో తను ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేయాలా.. టార్గెట్ చేయడానికి ఏ అంశం దొరుకుతుందా అని వేచి చూస్తుంది ఈ బ్యూటీ. ఇప్పుడు కూడా దేశమంతా దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనతో హర్షం వ్యక్తం చేస్తుంటే శ్రీ రెడ్డి మాత్రం మరోలా ఆలోచించింది. అందరిలా ఆలోచిస్తే ఈమె శ్రీ రెడ్డి ఎందుకవుతుంది చెప్పండి.. అందుకే కాస్త భిన్నంగా ఆలోచించింది. ఓ వైపు నలుగురు రేపిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ చెప్పింది.. దాంతోపాటే జై కెసీఆర్ అంటూ పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి.

అక్కడితో ఆగిపోతే బాగానే ఉండు కానీ అక్కడ్నుంచే అసలు కథ మొదలైంది. మరో పోస్ట్ పెట్టి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు అందరితోనూ చివాట్లు తింటుందిప్పుడు. ఈమె చేసిన ట్వీట్ సరికొత్త చర్చకు తెర తీస్తుంది. ఎవరైతే పీకే మాదిరి మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారో వాళ్ళను కూడా ఎన్‌కౌంటర్‌ చేసేయాలి.. ఏపీ పోలీసులకు ఇదే నా విన్నపం అంటూ సంచలన కామెంట్ చేసింది శ్రీ రెడ్డి. దాంతో ఫ్యాన్స్ ఈమెపై మండిపడుతున్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తామంటూ ఫైర్ అవుతున్నారు.


అసలు పవన్ కల్యాణ్ అంటే ఎందుకంతా కసి నీకు.. ఆయనేం అన్యాయం చేసాడు నీకు అంటూ మండిపడుతున్నారు అభిమానులు. ఎలా పడితే అలా మాట్లాడితే ఆడదానికి అని కూడా చూడమంటూ పవన్ ఫ్యాన్స్ మంటెక్కిపోయి ఉన్నారిప్పుడు. కాస్టింగ్‌ కౌచ్ ఇష్యూ తీసినరోజు నుంచి కూడా ఇప్పటి వరకు పవన్ కల్యాణ్‌ను ప్రతి ఇష్యూలోకి లాగుతూ ఇష్టమొచ్చినట్లు తిడుతూనే ఉంది శ్రీ రెడ్డి. అమ్మను కూడా అనడంతో ఓ సారి బయటికి వచ్చి సీరియస్ అయ్యాడు కూడా.అయినా కూడా శ్రీ రెడ్డి తగ్గట్లేదు.. అవకాశం దొరికిన ప్రతీసారి ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా మరోసారి రెచ్చిపోయింది. అయితే మరీ రేపిస్టులతో పోల్చడం మాత్రం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి చంపేస్తామంటూ సోషల్ మీడియాలోనే మెసేజ్‌లు పెడుతున్నారు. మరోవైపు శ్రీ రెడ్డి పెట్టిన పోస్ట్ చూసి ఇండస్ట్రీలో కూడా కొందరు ఆమెపై సీరియస్ అవుతున్నట్లు తెలుస్తుంది.
First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>