మెగా హీరోలపై శ్రీ రెడ్డి సంచలన పోస్ట్.. అతన్ని తొక్కేయకండ్రా..

శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో (Sri Reddy)

Sri Reddy: కొన్ని రోజులుగా చాలా సైలెంట్‌‌గా తన పని తాను చూసుకుంటున్న శ్రీ రెడ్డి.. ఇప్పుడు ఉన్నట్లుండి మళ్లీ విరుచుకుపడింది. మెగా హీరోలపై సంచలన పోస్ట్ చేసింది ఫేస్ బుక్కులో. ఇది చూసి ఫ్యాన్స్‌కు మండిపోతుంది.

  • Share this:
యూ ట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసుకుంది.. హాయిగా వంటలు చేసుకుంటుంది.. అన్నీ మరిచిపోయుంటుంది.. అందుకే సైలెంట్‌గా ఉంది అనుకుంటున్నారేమో..? కారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసింది కానీ లోపల మాత్రం ఒరిజినల్ అలాగే ఉంది.. ఇప్పుడు శ్రీ రెడ్డిని చూసి అంతా అనుకుంటున్న మాటలు ఇవే. కొన్ని రోజులుగా చాలా సైలెంట్‌‌గా తన పని తాను చూసుకుంటున్న ఈమె ఇప్పుడు ఉన్నట్లుండి మళ్లీ విరుచుకుపడింది. మెగా హీరోలపై సంచలన పోస్ట్ చేసింది ఫేస్ బుక్కులో. అది చూసిన తర్వాత మరో మాట లేకుండా అభిమానులకు మండిపోయింది. ఎప్పుడు ఎవరో ఒకర్ని టార్గెట్ చేసే శ్రీ రెడ్డి ఇప్పుడు మాత్రం మెగా కుటుంబంపై పడింది.
శ్రీ రెడ్డి పోస్ట్ (Sri Reddy Facebook)
శ్రీ రెడ్డి పోస్ట్ (Sri Reddy Facebook)

నాగ శౌర్య లాంటి టాలెంటెడ్ హ్యాండ్ సమ్ హీరోలను తొక్కేయకండ్రా తొక్కలో మెగా హీరోస్ కోసం అంటూ ఈమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇది చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే నాగశౌర్య నటించిన అశ్వథ్ధామ సినిమా ఈ వారమే విడుదలైంది. దీనికి యావరేజ్ టాక్ వచ్చింది. అయితే చాలా చోట్ల అల వైకుంఠపురములో సినిమా కోసం దీనికి సరైన థియేటర్స్ ఇవ్వలేదనే వాదన ఇండస్ట్రీలో ఉంది. అది చూసి ఇప్పుడు శ్రీ రెడ్డి ఇలాంటి పోస్ట్ పెట్టిందేమో అంటున్నారు. అయితే ఇక్కడ శ్రీ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం మరోటి ఉంది. నాగశౌర్య ఏ సినిమాకైనా ముందు చిరంజీవి ఇంటికి వచ్చి అశీస్సులు తీసుకుని వెళ్తాడు.
శ్రీ రెడ్డి పోస్ట్ (Sri Reddy Facebook)
శ్రీ రెడ్డి పోస్ట్ (Sri Reddy Facebook)

ఛలో నుంచి ఇదే చేస్తున్నాడు. ఆయన కూడా మనస్పూర్థిగా ఆశీర్వదిస్తుంటాడు. అశ్వథ్థామ విడుదలకు ముందు కూడా చిరు ఇంటికి వచ్చాడు ఈయన. కానీ ఇవేం తెలుసుకోకుండా శ్రీ రెడ్డి మాత్రం అనవసరంగా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తుందంటూ రివర్స్ అటాక్ మొదలుపెట్టారు అభిమానులు. అయినా కొన్ని రోజులుగా ఎలాంటి వివాదాలు లేకుండా సైలెంట్ అయిపోయిన ఈ బ్యూటీ ఉన్నట్లుండి ఇలాంటి పోస్ట్ పెట్టడం ఎవరికీ నచ్చడం లేదు. మొన్న కూడా జేడీ లక్ష్మీనారాయణ జనసేన నుంచి బయటికి వచ్చేసిన తర్వాత మీ మీద గౌరవం నాకు ఇంకా పెరిగిపోయింది సర్ అంటూ పోస్ట్ చేసింది. దాంతో పవన్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడ్డారు. అది మరిచిపోకముందే మరోసారి రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. ఈ సారి కుటుంబాన్నే టార్గెట్ చేసింది. మరి దీనికి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published: