SRI REDDY SENSATIONAL POST ON HOUSE WIVES AND COMMENTS ON THEM IN SOCIAL MEDIA PK
అలాంటి వాళ్లు భార్యలుగా వద్దు.. శ్రీ రెడ్డి శ్రీరంగ నీతులు..
శ్రీ రెడ్డి పోస్ట్ (sri reddy facebook)
Sri Reddy: శ్రీ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ఓ వైపు కరోనా వచ్చి ప్రపంచమంతా సంచలనాలు చేస్తుంటే ఈమె మాత్రం శ్రీరంగ నీతులు చెబుతుంది. సూక్తులు వల్లిస్తుంది.
శ్రీ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ఓ వైపు కరోనా వచ్చి ప్రపంచమంతా సంచలనాలు చేస్తుంటే ఈమె మాత్రం శ్రీరంగ నీతులు చెబుతుంది. సూక్తులు వల్లిస్తుంది. సినిమాల్లోని హీరోయిన్లే నేటి గృహిణిలను చెడగొడుతున్నారంటూ వాళ్లపై ఆడిపోసుకుంటుంది. తాజాగా ఫేస్ బుక్లో ఈమె చేసిన పోస్టులు ఎవరికీ అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఇలాంటి పోస్టులు పనిపాట లేకుండా ఇప్పుడెందుకు పెట్టావమ్మా అంటూ శ్రీ రెడ్డిని అడుగుతున్నారు నెటిజన్లు. మీకు బాగా నచ్చిన వాళ్లు.. మీరు ఇష్టపడే వాళ్లకు మీకు కానీ విలువ ఇవ్వలేదంటే వదిలేయండి.. వాళ్ల ప్రేమలో స్వార్థం ఉంది.. వాళ్లు విషంతో సమానం.. వాళ్ళతో ఉంటే మీ ఉనికి మీరు కోల్పోతారంటూ సూక్తులు చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
శ్రీ రెడ్డి యూ ట్యూబ్ ఛానెల్ (sri reddy)
అంతేకాదు నిజ జీవితంలో హీరోయిన్లను అస్సలు ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దని చెబుతుంది. ఎందుకంటే వాళ్లదంతా నటన అని చెబుతుంది. వాళ్లంతా డబ్బున్న వాళ్లను.. అందగాళ్లను మాత్రమే పెళ్లి చేసుకుంటారు.. కానీ నిజ జీవితంలో వాళ్లు నటించిన సినిమాలను చూపించడానికి.. ఆ సినిమాలకు టిక్కెట్స్ కొనడానికి మాత్రం కావాల్సింది పేద అబ్బాయిలే అంటూ సపోర్ట్ చేసింది ఈమె. కేవలం సినిమా హీరోయిన్ల వల్లే ఈ రోజు చాలా మంది ఆడవాళ్లు చెడిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. వాళ్లను చూసి అంతా తమకు డబ్బున్న మొగుడే కావాలని.. డబ్బుల్లేకపోతే చచ్చిపోతున్నారంటూ శ్రీ రెడ్డి ఫేస్ బుక్లో రాసింది.
శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో (Sri Reddy hot)
ఈ మధ్య సరైన ప్రవర్తన లేని భార్యలను చాలా మందినే చూసానంటూ కామెంట్ చేసింది శ్రీ రెడ్డి. అర్దరాత్రి వరకు మేల్కొని ఉండటం.. టిక్ టాక్లు చూడటం.. అలాంటి వీడియోలు చేయడం.. ఇష్టమొచ్చినట్లు చెడుగా మాట్లాడుకోవడం చేస్తున్నారని.. భర్తను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారని చెబుతుంది. సీరియల్ యాక్టర్స్లా భర్తలను ఎమోషనల్ అత్యాచారం చేస్తున్న భార్యలు అస్సలు వద్దంటుంది ఈమె. ఇలాంటి వాళ్లెలా సమాజానికి మంచి బాధ్యత గల పౌరులను అందిస్తారని ప్రశ్నిస్తుంది ఈమె. అసలు ఉన్నట్లుండి ఇన్నేసి శ్రీరంగ నీతులు ఎందుకు చెప్పాల్సి వచ్చింది శ్రీ రెడ్డి అంటూ ఆమెను చాలా మంది అడుగుతున్నారు. నువ్వు వీటి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.