SRI REDDY SENSATIONAL COMMENTS ON TOLLYWOOD DRUGS RACKET AND WANTS SECURITY PK
Sri Reddy: టాలీవుడ్లో వాళ్ళంతా డ్రగ్స్ బానిసలే.. శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో (sri reddy/Facebook)
Sri Reddy: దేశవ్యాప్తంగా మరోసారి డ్రగ్స్ కుంభకోణం అన్ని ఇండస్ట్రీలను కుదిపేస్తుంది. ముఖ్యంగా సినిమా వాళ్లు చాలా మంది డ్రగ్స్‌కు బానిసలు అయిపోయారంటూ వార్తలు వస్తున్న..
దేశవ్యాప్తంగా మరోసారి డ్రగ్స్ కుంభకోణం అన్ని ఇండస్ట్రీలను కుదిపేస్తుంది. ముఖ్యంగా సినిమా వాళ్లు చాలా మంది డ్రగ్స్‌కు బానిసలు అయిపోయారంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఎప్పుడు ఎవరి పేరు బయటికి వస్తుందో తెలియక అంతా తలలు పట్టుకుని కూర్చున్నారు. ఇప్పటికే ఈ రాకెట్లో రియా చక్రవర్తి ప్రధాన సూత్రదారి అనేది తెలిసిపోయింది. పైగా ఆమె విచారణంలో రకుల్ పేరు బయటికి రావడం మరో సంచలనం. ఇక మన పక్కనున్న కన్నడ ఇండస్ట్రీ పూర్తిగా డ్రగ్స్ మత్తులోనే ఊగిపోతుంది.
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh/Instagram)
చాలా మంది హీరో హీరోయిన్లు ఈ మత్తుకు బానిస అయిపోయారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. పైగా ఇది టాలీవుడ్లో కూడా ఉందని రెండు మూడేళ్ల కిందే తెలిసింది. అప్పట్లో పూరీ జగన్నాథ్, రవితేజ సహా చాలా మంది పేర్లు బయటికి వచ్చాయి. అంతా కొన్ని రోజుల పాటు నార్కోటిక్స్ అధికారల ముందు విచారణకు హాజరయ్యారు కూడా. అయితే అది అక్కడితో ముగిసిపోయింది అనుకున్నారంతా. కానీ ఇప్పుడు పక్క ఇండస్ట్రీలకు కూడా పాకిపోయింది.
శ్రీ రెడ్డి (File/Photo)
ఇదిలా ఉంటే తాజాగా శ్రీ రెడ్డి కూడా ఈ డ్రగ్స్ కుంభకోణంపై నోరు విప్పింది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ఈ నటి ఇప్పుడు డ్రగ్స్ రాకెట్‌పై మాట్లాడుతుంది. బాలీవుడ్, శాండిల్ వుడ్ కాదు టాలీవుడ్ కూడా మత్తులోనే ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది ఈమె. తెలుగు ఇ:డస్ట్రీలో కూడా చాలా మంది డ్రగ్స్ తీసుకుంటారని శ్రీ రెడ్డి ఆరోపించింది. చాలా మంది సెలబ్రిటీలు రేవ్ పార్టీలను నిర్వహిస్తుంటారని చెప్పుకొచ్చింది.
శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో (Image: Srireddy/ Facebook)
పెద్ద పెద్ద హోటల్స్‌లో కూడా ఈ పార్టీలు జరుగుతుంటాయని.. అందులో వాళ్లంతా డ్రగ్స్ తీసుకుంటారని తెలిపింది శ్రీ రెడ్డి. అంతేకాదు ఈ పార్టీలకు వచ్చే అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వాళ్లను వాడుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు భద్రత కల్పిస్తే.. టాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకునే వాళ్ళ పేర్లను బయటపెడతానని చెప్పింది. మరి ఈమెకు భద్రత ఇస్తారా.. ఇస్తే అందరి పేర్లు చెప్తుందా లేదా అనేది చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.