పవన్ కళ్యాణ్‌ ఆ హీరోయిన్ జీవితాన్ని నాశనం చేసాడంటున్న శ్రీ రెడ్డి..

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో శ్రీరెడ్డి గురించి తెలియని వారు ఎవరూ లేరు. తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం తెర వెనక జరుగుతున్న కౌస్టింగ్ కౌచ్‌పై గళమెత్తి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది శ్రీరెడ్డి.

news18-telugu
Updated: March 12, 2019, 10:56 PM IST
పవన్ కళ్యాణ్‌ ఆ హీరోయిన్ జీవితాన్ని నాశనం చేసాడంటున్న శ్రీ రెడ్డి..
పవన్ కల్యాణ్, శ్రీరెడ్డి
  • Share this:
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో శ్రీరెడ్డి గురించి తెలియని వారు ఎవరూ లేరు. తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం తెర వెనక జరుగుతున్న కౌస్టింగ్ కౌచ్‌పై గళమెత్తి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది శ్రీరెడ్డి. అంతేకాదు టాలీవుడ్‌లో పలువురు హీరోలతో పడక సుఖాన్ని పంచుకున్నట్లు ప్రకటించి సినీ పరిశ్రమలో పెను దుమారాన్నే రేపింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసి సంచలనం రేపిన శ్రీరెడ్డి..తాజాగా మరోసారి జనసేనాని పవన్ కళ్యాణ్‌తో పాటు త్రివిక్రమ్‌ను యూట్యూబ్ చానెల్ సాక్షిగా మండిపడింది. పవన్ కళ్యాణ్ వల్ల పూనమ్ కౌర్ చాలా బాధ పడింది. ఆమె పడిన బాధలు ఇండస్ట్రీలో వారికి తెలియదు. పవన్‌ను పూనమ్‌ ఎంతగానో ఇష్టపడింది. ఆయనతో లివింగ్ రిలేషన్ షిప్ ఉంటే చాలని చెప్పింది. పవన్ కళ్యాణ్ కారణంగా ఆమె ఓసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆమె హాస్సిటల్ ‌లో జాయిన్ అయితే పవన్ కళ్యాణే బిల్లు మొత్తం ఎందుకు పే చేసాడు.

Sri Reddy Sensational comments On Pawan kalyan, Trivikram over Parvati Melton Pregnancy Issue, Sri reddy Sensational comments, Sri Reddy Sensational comments On Pawan Kalyan, Sri Reddy Sensational Comments Pawan Kalyan Trivikram, Sri Reddy Sensational Comments On pawan Kalyan Trivikram Over Parvati melton Issue, Tollywood, Telugu cinema, శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్, పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ పై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్, పార్వతి మెల్టన్ ఇష్యూపై పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ పై శ్రీ రెడ్డి కామెంట్స్, శ్రీరెడ్డి పార్వతి మెల్టన్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్, టాలీవుడ్ న్యూస్, తెలుగు సినిమా
శ్రీరెడ్డి, పవన్ కల్యాణ్


మరోవైపు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌..హీరోయిన్ పార్వతి మెల్టన్‌ను తీవ్రంగా వేధించాడు. అతని కారణంగా ఆమె గర్భం కూడా దాల్చింది. ఆ తర్వాత ఆమెకు అబార్షన్ చేయించినట్టు ఆరోపణలు గుప్పించింది. ఆ తరవాత ఆమెకు వచ్చిన ఆఫర్స్ అన్నింటినీ ఆమెకు రాకుండా త్రివిక్రమ్ అడ్డుకున్నారని ఈ యూట్యూబ్ ఛానెల్‌లో వివరించింది. పూనమ్ కౌర్ టేపుల్లో మాటలను వీడియోలో వినిపించిన శ్రీరెడ్డి.. నేను  ఏ హీరోతో తిరగలేదు. దర్శకుడితో ఎఫైర్ పెట్టుకోలేదు. పవన్ కళ్యాణ్‌ను ఫైవ్ స్టార్ హోటల్లో కలవడం బయటకు వచ్చే దైర్యం లేదు. అభిమానులు తనను అనకూడని మాటలు అంటే ఖండించలేదు అని ఆడియో టేపులో చెప్పిన మాటలను వీడియోలో ప్రదర్శించింది. ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసిన పవన్ కళ్యాణ్‌కు ఎన్నికల్లో ఓటు వేయెద్దని ప్రజలను అభ్యర్థించింది. ఇక శ్రీరెడ్డి సెన్సేషన్ కోసమే పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయనకు సన్నిహితుడైన త్రివిక్రమ్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని పవన్ అభిమానలు ఆరోపిస్తున్నారు.First published: March 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు