• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SRI REDDY SENSATIONAL COMMENTS ON NIHARIKA WEDDING AND TARGETS MEDIA FOR HIGHLIGHTING MARRIAGE PK

Sri Reddy Niharika Wedding: ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి.. నిహారిక వెడ్డింగ్‌పై శ్రీ రెడ్డి కామెంట్స్..

Sri Reddy Niharika Wedding: ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి.. నిహారిక వెడ్డింగ్‌పై శ్రీ రెడ్డి కామెంట్స్..

నిహారిక కొణిదెల శ్రీ రెడ్డి (niharika konidela sri reddy)

Sri Reddy Niharika Wedding: టాలీవుడ్‌లో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే బ్యూటీ శ్రీ రెడ్డి. కాంట్రవర్సీ ఉన్నా లేకపోయినా కావాలనే క్రియేట్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కూడా ఇదే చేసింది. కొన్ని రోజులుగా సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటున్న..

  • Share this:
టాలీవుడ్‌లో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే బ్యూటీ శ్రీ రెడ్డి. కాంట్రవర్సీ ఉన్నా లేకపోయినా కావాలనే క్రియేట్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కూడా ఇదే చేసింది. కొన్ని రోజులుగా సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు నిహారిక పెళ్లితో మరోసారి వార్తల్లో నిలిచింది. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడిలా ఎందుకు ఇప్పుడు ఇంత రచ్చ చేస్తున్నారు అంటూ అభిమానులపై సీరియస్ అయింది శ్రీ రెడ్డి. వాడెవడో కూతురు పెళ్లి జరిగితే మీరెందుకురా తెగ పిసికేసుకుంటున్నారు అంటూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. ఎవరో పెళ్లికి మీ ఇంట్లో పెళ్లిలా ఎందుకు హడావిడి చేస్తున్నారు.. సోషల్ మీడియాలో తెగ షేర్స్ చేసుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తుంది శ్రీ రెడ్డి. నాగబాబు కూతురు పెళ్లికి మీరంతా ఎందుకు హడావిడి చేస్తున్నారు.. కుక్కల్లా అంటూ సెటైర్లు వేసింది. యూ ట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు.. పవన్ కళ్యాణ్ వచ్చాడు.. ఆయనొచ్చాడు.. ఈయనొచ్చాడు.. డాన్సులేసాడు అంటూ సంపేస్తున్నారు.. ఏంట్రా ఇది ఏదైనా ఉపయోగపడే పని చేయండిరా అంటూ వార్నింగ్ ఇచ్చింది శ్రీ రెడ్డి.
niharika konidela,sri reddy comments on niharika marriage,niharika konidela wedding,sri reddy niharika marriage,sri reddy on niharika marriage,niharika konidela marriage,sri reddy on niharika wedding,niharika shocking comments on sri reddy,sri reddy comments niharika marriage,sri reddy video on niharika wedding,నిహారిక పెళ్లి,శ్రీ రెడ్డి నిహారిక,నిహారిక పెళ్లిపై నిహారిక కామెంట్స్
నిహారిక పెళ్లి (Niharika Wedding)

అక్కడ రైతులు రోడ్లమీదకొచ్చి ఏడుస్తుంటే సపోర్ట్ చేయడం తెలియదు కానీ ఈ చెత్త మాత్రం షేర్స్ కొట్టుకుంటూ అబ్బా! అనడం.. ఛీ, చేంజ్ కండిరా అంటూ సీరియస్ కామెంట్స్ చేసింది ఈ కాంట్రవర్సీ క్వీన్. అక్కడితో ఆగకుండా మీడియాను కూడా టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి. ఏదైనా మంచి విషయం చూపించడానికి టైమ్ లేదు కానీ ఇలాంటి చెత్తను మాత్రం బాగా కవర్ చేస్తుంటారు కొందరు అంటూ కామెంట్ చేసింది శ్రీ రెడ్డి. అది కూడా తాను అన్ని మీడియాలను అనడం లేదని.. ఇప్పుడు నాగబాబు కూతురు పెళ్లిని హైలైట్ చేసిన వాళ్లనే అంటున్నానని చెప్పింది.

ఇప్పుడు అంతా ఈ పెళ్లిని హైలైట్ చేసారు కాబట్టి అందర్నీ అన్నట్లే కదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఓ వైపు రైతులు రోడ్డెక్కారు.. పక్కనున్న తమిళనాడులో ఓ అమ్మాయి చచ్చిపోయింది.. అలాంటివి చూపించకుండా ఛీ.. నిహారిక పెళ్లి కావాల్సి వచ్చిందా మీకు అంటూ కామెంట్ చేసింది శ్రీ రెడ్డి. చివర్లో తాను అందర్నీ అనడం లేదని.. ఇలాంటివి చూసుకుంటూ పిసికేసుకుంటున్నారు కదా వాళ్లను మాత్రమే అంటున్నానంటూ తెలిపింది శ్రీ రెడ్డి. ఈమె చేసిన వ్యాఖ్యలపై ఎప్పట్లాగే మెగా ఫ్యాన్స్ సింపుల్‌గా నిన్ను చంపేస్తామంటూ వార్నింగులు ఇస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు