Sri Reddy | Keerthy Suresh : ఛీఛీ కీర్తి సురేష్ ఇలాంటీ సినిమా చేసిందా నమ్మలేకపోతున్నా.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

కీర్తి సురేష్, శ్రీ రెడ్డి Photo : Twitter

Sri Reddy | Keerthy Suresh : శ్రీరెడ్డి... ఓ సంచలన తార. క్యాస్టింగ్‌ కౌచ్‌ విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసి.. ప్రస్తుతం చెన్నైలో ఉంటోంది.

 • Share this:
  శ్రీరెడ్డి... ఓ సంచలన తార. క్యాస్టింగ్‌ కౌచ్‌ విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసి.. ప్రస్తుతం చెన్నైలో ఉంటోంది. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీపై, కొందరు ప్రముఖలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సినీ ఇండస్ట్రీలో సంచలనాలకు తెరలేపిన శ్రీరెడ్డి తాజాగా మహానటితో జాతీయ అవార్డ్ అందుకున్న తెలుగు తమిళ నటి కీర్తి సురేష్‌ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే.. కీర్తి సురేష్ తెలుగులో ఎప్పుడో మూడు నాలుగు సంవత్సరాల కింద ఓ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా అప్పట్లో విడుదలకు నోచుకోలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ సినిమా రెండు జెళ్ళ సీత పేరుతో విడుదలవుతోంది. అందులో భాగంగా ఈ
  సినిమాకు సంబంధించిన ఓ ట్రైలర్’ను తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ కీర్తి సురేష్‌కు ఉన్న పాపులారిటీ, ఇమేజ్ కారణంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ ట్రైలర్‌ను చూసిన సంచలన తార శ్రీరెడ్డి కీర్తి సురేష్‌ టార్గెట్ చేస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది.

  తన మాటల్లో చెప్పాలంటే.. 'ఛీ ఛీ ఛీ ఇదేం సినిమా, మహానటి సినిమా చేసిన కీర్తి సురేష్ ఇలాంటి సినిమా చేసింది ఏంటి అసలు నమ్మలేక పోతున్నా' అంటూ ఆ సినిమా చేయడం వల్ల కీర్తి సురేష్‌కు ఉన్నగౌరవం పోయిందనే అర్ధం వచ్చే లా కామెంట్ చేసింది. దీంతో నెటిజన్స్ కూడా ఆ సినిమాపై అందులో నటించిన యాక్టర్స్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు.
  ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా దుబాయ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ నితిన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. రంగ్ దే పేరుతో వస్తోన్న ఈ సినిమా ఉగాది కానుకగా విడుదలకానుంది. వీటితో కీర్తి సురేష్ రజనీకాంత్ అన్నాత్తేలో ఓ కీలకపాత్రలో కనిపించనుంది. అంతేకాదు చిరంజీవి ప్రధాన పాత్రలో ఓ రీమేక్ సినిమాలో కూడా కీర్తి సురేష్ నటించనుందని సమాచారం.
  Published by:Suresh Rachamalla
  First published: