ఎపుడో ఏదో ఒక వ్యాఖ్యలతో ఎపుడు వివాదాల్లో ఉండే శ్రీరెడ్డి తాజాగా.. మహానటి ఫేమ్ కీర్తి సురేష్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకరం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. తెలుగులో ‘నేను శైలజా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ సినిమాలో కథానాయికగా నటించింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’తో మోడ్రన్ మహానటి అయిపోయింది. ఈ సినిమాతో నటిగా కీర్తి సురేష్ ఇమేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఈ భామ దక్షిణాదిలో తెలుగు, తమిళంతో పాటు హిందీలో కథానాయికగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. తాజాగా బాలీవుడ్లో చేయబోయే సినిమా కోసం ఎవరు గుర్తు పట్టలేనంతగా కీర్తి సురేష్ చాలా సన్నబడింది. తాజాగా ఈమె ఓ ఫ్లైట్‌లో ప్రయాణం చేస్తే తోటి ప్రయాణికులెవరు ఆమెను గుర్తు పట్టలేకపోయారని సంచలన నటి శ్రీరెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్లో తెలిపింది.

కీర్తి సురేష్,సాయి పల్లవి
అంతేకాదు కీర్తి సురేష్‌ను తాను కూడా గుర్తు పట్టలేకపోయానని చెప్పింది. అంతేకాదు అక్కడున్న ప్రయాణికులందురు నన్ను గుర్తుపెట్టి నాతో సెల్పీలు దిగడానికి పోటీ పడ్డారు. కానీ కీర్తి సురేష్‌ను అసలు పట్టించుకోలేదు. ఆ తర్వాత కొంత మంది సినిమా వాళ్లు ఆమెను రిసీవ్ చేసుకోవడంతో నాతో పాటు చాలా మందికి ఆమె కీర్తి సురేష్ అన్న విషయం తెలిసింది.ఇక మహానటిలో కీర్తి సురేష్ నటనను అందరు మెచ్చుకున్నారు. కానీ ఆ క్రెడిట్ అంతా కీర్తి సురేష్ ది మాత్రం కాదు.. ఈ సినిమాను తీసిన దర్శకుడు నాగ్ అశ్విన్‌కు చెందుతుందని చెప్పుకొచ్చింది.
కీర్తి సురేష్ కంటే నటనలో సాయి పల్లవి ఎన్నో రెట్లు నయం అంటూ వ్యాఖ్యానించింది. ఇక శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పలువరు శ్రీరెడ్డి తీరుపై మండిపడుతున్నారు. సాయి పల్లవి మంచి నటి అనడంలో ఎలాంటి తప్పులేదు. కానీ సాయి పల్లవిని అడ్డం పెట్టుకొని కీర్తి సురేష్‌ను తక్కువ చేసిన మాట్లాడటం భావ్యం కాదు అంటున్నారు. ఏమైనా శ్రీరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published by:Kiran Kumar Thanjavur
First published:June 17, 2019, 20:43 IST