SRI REDDY SENSATIONAL COMMENTS ON JANASENA CHIEF POWER STAR KALYAN TA
Sri Reddy: జనసేనాని పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకు పడ్డ శ్రీ రెడ్డి ..
పవన్ కల్యాణ్, శ్రీరెడ్డి
జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వివాదాస్పద నటి శ్రీరెడ్డి మొదటి నుంచి టార్గెట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీ రెడ్డి మరోసారి పవన్ కళ్యాణ్ పై ఎటాక్ చేసింది.
జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వివాదాస్పద నటి శ్రీరెడ్డి మొదటి నుంచి టార్గెట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమెకు అనుకూలంగా మాట్లాడలేదనే కోపంతో ఇప్పటికీ పవన్‌పై ఆమె విషం కక్కుతూనే ఉంది. పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. సోషల్ మీడియాలో శ్రీ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఆమె చేసిన పోస్టులు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వివాదస్పద కామెంట్ చేసింది శ్రీ రెడ్డి. తనదైన భావ జాలంతో చుక్కలు చూపించింది.వివరాలలోకి వెళితే .. ఏపీలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాకతోపాటు భీమవరం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. తన సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు ఊపు తేవడం కోసం ఆయన.. భీమవరం నుంచి పోటీ చేశారు. భీమవరంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా పవన్ ఇక్కడి నుంచి పోటీకి దిగడానికి కారణమైందని వార్తలొచ్చాయి. పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఏపీ రాజకీయాల్లో భీమవరం హాట్ టాపిక్ అయ్యింది. కానీ అనూహ్యంగా ఆయన భీమవరంలో పాటు గాజువాక లో కూడా ఓటమిపాలైన విషయం తెలిసిందే . అయితే పవన్ ఇక సినిమాలు చేసుకుంటాడని అంతా అనుకున్నారు.
శ్రీరెడ్డి, పవన్ కల్యాణ్
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను రాజకీయాలు వదిలే ప్రసక్తే లేదని తేల్చేసారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో విక్టరీ కొట్టేందుకు వ్యూహరచనలు చేస్తూ అధికార పార్టీపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో '100 రోజుల టైం ఇస్తున్నా.. ఆ తరువాత నా ప్రతాపం' చూపిస్తా అంటూ ప్రభుత్వానికి లేఖ రాశాడు పవన్. పవన్ తీరు చూసిన శ్రీ రెడ్డి వెంటనే ఆయనపై ఎటాక్ చేస్తూ ఫేస్బుక్ పోస్ట్ పెట్టేసింది. ''కనీసం అసెంబ్లీలో కూర్చోటానికి సీటు లేదు నీకు అంటూ పెద్ద పదాలే వాడింది. అంతేకాదు నీకు నాకు పెద్దగా పని లేదు కదా.. వచ్చి కూర్చొని సొల్లు చెప్పుకుందాం'' అంటూ సెటైరికల్‌గా పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ఈ కామెంట్స్ పై జన సైనికులు ఎలా స్పందిస్తారనేది చూాడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.