Chiranjeevi - Sri Reddy: చిరంజీవి..ఎన్టీఆర్‌పై‌ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కౌంట‌ర్ ఇస్తున్న మెగా ఫ్యాన్స్

Sri Reddy sensational comments on Chiranjeevi and NTR anger mega fans counters her

Chiranjeevi - Sri Reddy: తాజాగా త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసుకుని చిరంజీవి, ఎన్టీఆర్‌లపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

  • Share this:
    కాస్టింగ్ కౌచ్‌పై బ‌హిరంగంగా మాట్లాడుతూ టాలీవుడ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన వారిలో శ్రీరెడ్డి ఒక‌టి. ద‌క్షిణాదిన ముఖ్యంగా తెలుగులో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ వాదించ‌డ‌మే కాకుండా ఫిల్మ్ ఛాంబ‌ర్ ముందు న‌గ్నంగా నిర‌స‌న‌ను తెలియ‌జేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. త‌ర్వాత తెలుగుకే ఈ అమ్మ‌డు ప‌రిచ‌యం కాలేదు. త‌మిళ చిత్ర సీమ‌లో చాలా మందిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నాన్ని క్రియేట్ చేశాయి. ఈ మ‌ధ్య అడ‌పాద‌డ‌పా త‌న సోష‌ల్ గ్లామ‌ర్ షోస్‌తో రెచ్చిపోతున్న సంగ‌తి తెల‌సిందే. తాజాగా త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసుకుని చిరంజీవి, ఎన్టీఆర్‌లపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

    అస‌లు ఇంత‌కీ శ్రీరెడ్డి ఎందుకు చిరంజీవి మీద ప‌డింది? అనే వివ‌రాల్లోకి వెళితే, చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ఆచార్య‌. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ టీజ‌ర్‌పై శ్రీరెడ్డి త‌న ట్విట్ట‌ర్ ద్వారా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ‘‘ఆచార్య కథ నాకు తెలిసిపోయింది, చిరంజీవి ఎక్కడి నుండో ఒక ఊరికి వస్తాడు, ఆ ఊర్లో వాళ్ళ కి దేవుడిలా వాళ్ళ కష్టాలు తీరుస్తాడు ..అంతే’’ అంటూ ముందు ‘ఆచార్య’ టీజర్‌పై స్పందించిన శ్రీరెడ్డి.. తర్వాత మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య పోలికలు పెట్టి, మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ డెలివరీని ఎద్దేవా చేసింది.





    ‘‘అబ్బే, ఎంతైనా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి నటన ముందు చిరంజీవి కూడా సరిపోడు, ఆచార్య ట్రైలర్ లో డైలాగ్ డెలివరీ అస్సలు బాగోలేదు’’ అంటూ శ్రీరెడ్డి మరో ట్వీట్ చేసింది. అయితే మెగా ఫ్యాన్స్‌ను కెలికితే వారు ఊరుకుంటారా? ‘నువ్వు ఎంత మాట్లాడినా, నీకు లీడ్ ఇవ్వ‌రు’ అని ఒక‌రంటే, ‘ఎందుకివ్వ‌ర‌న్నా, బ్లూఫిలింలో లీడ్ రోల్ త‌ప్ప‌కుండా ఇస్తారు’ అంటూ మరొక‌రు కామెంట్ పెట్టారు. ‘దీనికి జూ గాడు ఎన్ని పైస‌లు ఇచ్చాడో’ అని మ‌రొక‌రు, ఇంకొక‌రైతే ‘స్వాతి నాయుడు వీడియోల‌తో పోల్చితే శ్రీరెడ్డి వీడియోలు అస్స‌లు బాగోలేవు’ అని కామెంట్స్ పెడుతూ శ్రీరెడ్డిపై కామెంట్స్ విసురుతున్నారు.
    Published by:Anil
    First published: