SRI REDDY SENSATIONAL COMMENTS ON BIGG BOSS 3 AND WILDCARD ENTRY TAMANNA SIMHADRI PK
Bigg Boss 3: శిఖండిని అడ్డుపెట్టుకుని బిగ్ బాస్ ఆడుకుంటున్నాడంటున్న శ్రీ రెడ్డి..
బిగ్‌బాస్ 3 హోస్ట్ ఎవరో చెప్పేసిన శ్రీరెడ్డి
ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేయకపోతే శ్రీరెడ్డికి నిద్ర కూడా సరిగ్గా పట్టదేమో మరి..? ప్రతిక్షణం ఏదో ఓ వివాదాస్పద కామెంట్‌తో వార్తల్లో నిలిచే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కూడా ఇదే చేసింది.
ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేయకపోతే శ్రీరెడ్డికి నిద్ర కూడా సరిగ్గా పట్టదేమో మరి..? ప్రతిక్షణం ఏదో ఓ వివాదాస్పద కామెంట్‌తో వార్తల్లో నిలిచే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కూడా ఇదే చేసింది. మరోసారి బిగ్ బాస్ షోను టార్గెట్ చేసింది. తెలుగు బిగ్ బాస్ షో తనకు అస్సలు ఇష్టం లేదని.. ఇక్కడ షో ఎప్పుడో నాశనం అయిపోయిందని సంచలన కమెంట్స్ చేసింది ఈమె. దీనికి తగ్గట్లుగానే మరో యాంకర్ శ్వేతా రెడ్డిని ఉద్దేశ్యించి పోస్ట్ కూడా చేసింది శ్రీరెడ్డి. ఆమెతో కలిసి ఉన్న ఫోటోలను చూపిస్తూ నా సపోర్ట్ మీకే అంటూ రాసుకొచ్చింది శ్రీ రెడ్డి.
శ్రీరెడ్డి, నాగార్జున (File)
శ్వేతారెడ్డి గారూ.. మీ దెబ్బకి బిగ్ బాస్ తెలుగు అట్టర్ ఫ్లాప్ అయింది.. నాకు కూడా తమిళ బిగ్ బాస్ బాగా నచ్చింది కానీ తెలుగు కాదు.. నా సపోర్ట్ మీకే అంటూ ఈమెకు మెసేజ్ పాస్ చేసింది ఈ ముద్దుగుమ్మ. దాంతో శ్వేతా రెడ్డితో గతంలో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది శ్రీరెడ్డి. దీనికి రెడ్డి పవర్ అనే క్యాప్షన్ పెట్టడం మరింత వివాదాస్పదంగా మారింది. ఇక అక్కడితో ఆగకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నాపై కూడా సంచలన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.
తమన్నాను టార్గెట్ చేస్తూ బిగ్ బాస్‌కు బిగ్ భయ్యా దొరికాడంటూ రెచ్చిపోయింది... దాంతో పాటు నాగార్జున భయ్యా సెలక్షన్ సూపర్ అంటూ సెటైర్ వేసింది శ్రీరెడ్డి. దానికి ముందు కూడా నాగార్జునపై పర్సనల్ టార్గెట్ చేసింది శ్రీరెడ్డి. ఈయనకు తెలిసినన్ని రాజకీయాలు చంద్రబాబుకు కూడా తెలియవు అంటూ రాసుకొచ్చింది ఈ బ్యూటీ. డబ్బిస్తే బిగ్ బాస్ హీరో.. లేదంటే ఎదవ అంటూ పోస్ట్ చేసింది. ఇక ఇప్పుడు తమన్నా రచ్చపై కూడా ఆమె నోరు పారేసుకుంది. శిఖండిని అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తున్న బిగ్ బాస్... తూ.. తెలుగు బిగ్ బాస్ నాశనం అంటూ పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. ఈమె అంటుందని కాదు కానీ తమన్నా ఎంట్రీ తర్వాత ఇంట్లో పరిస్థితులు మాత్రం ఒక్కసారిగా మారిపోయాయి.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.