శ్రీ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.. నన్ను వాడుకుంటే చుక్కలు చూపిస్తా..

శ్రీ రెడ్డి Twitter

శ్రీ రెడ్డి ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో ఊహించడం కూడా కష్టమే. ఆమె ఒక్కోసారి తెలుగు.. మరోసారి తమిళ ఇండస్ట్రీని కూడా టార్గెట్ చేస్తుంటుంది. మొన్నటికి మొన్న చిరంజీవి, పవన్ కల్యాన్ సహా మరికొందరు..

  • Share this:
శ్రీ రెడ్డి ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో ఊహించడం కూడా కష్టమే. ఆమె ఒక్కోసారి తెలుగు.. మరోసారి తమిళ ఇండస్ట్రీని కూడా టార్గెట్ చేస్తుంటుంది. మొన్నటికి మొన్న చిరంజీవి, పవన్ కల్యాన్ సహా మరికొందరు టాలీవుడ్ హీరోలపై చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. ఐటి రైడ్స్ గురించి కూడా శ్రీ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఇక ఇప్పుడు మరోసారి ఈమె రెచ్చిపోయింది. ఈ సారి ఏకంగా మీడియానే టార్గెట్ చేసింది ఈమె. ఉన్నట్లుండి ఎందుకో తెలియదు కానీ మీడియా వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది శ్రీ రెడ్డి.

Sri Reddy sensational and strong warning to Telugu Tamil You Tube Channels on spoof videos pk శ్రీ రెడ్డి ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో ఊహించడం కూడా కష్టమే. ఆమె ఒక్కోసారి తెలుగు.. మరోసారి తమిళ ఇండస్ట్రీని కూడా టార్గెట్ చేస్తుంటుంది. మొన్నటికి మొన్న చిరంజీవి, పవన్ కల్యాన్ సహా మరికొందరు.. Sri Reddy,Sri Reddy twitter,Sri Reddy facebook,Sri Reddy instagram,Sri Reddy spoof,Sri Reddy hot,Sri Reddy hot videos,Sri Reddy hot photos,Sri Reddy pawan kalyan,Sri Reddy kathi mahesh,Sri Reddy suresh babu,Sri Reddy casting couch,Sri Reddy you tube videos,Sri Reddy warning,Sri Reddy chiranjeevi,Sri Reddy movies,Sri Reddy fb,Sri Reddy hot scenes,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి వార్నింగ్,శ్రీ రెడ్డి మీడియాకు వార్నింగ్,శ్రీ రెడ్డి యూ ట్యూబ్ ఛానెల్స్,శ్రీ రెడ్డి పవన్ కల్యాణ్,తెలుగు సినిమా
శ్రీ రెడ్డి Facebook Photo


ఇప్పట్నుంచి చెబుతున్నా తెలుగు, తమిళ యూ ట్యూబ్ ఛానెల్స్.. ఎవరైనా కానీ నా వీడియోలు స్పూఫ్ చేసి వాడుకున్నారంటే మీకు చుక్కలు చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలా కానీ నన్ను వాడేసారంటే ఏం చేస్తానో చెప్పను.. చేసి చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చేసింది ఈ బ్యూటీ. శ్రీ రెడ్డి మాట్లాడిన తీరు చూసి అంతా పరేషాన్ అవుతున్నారు. అసలు ఎక్కడో ఉన్న శ్రీ రెడ్డిని తీసుకొచ్చి ఈ రోజు సెలెబ్రిటీగా మార్చేసిందే మీడియా. ఒకప్పుడు ఏదో ఛానెల్‌లో యాంకర్‌గా ఉన్న ఈమెను ఇంత పెద్ద సెలెబ్రిటీని చేసిందే యూ ట్యూబ్ ఛానెల్స్.

ఆమె గురించి ఎన్నో వేల వార్తలు రాస్తే కానీ ఈ రోజు అనుభవిస్తున్న స్టార్ డమ్ రాలేదు. అలాంటి వాటిపై నోరు పారేసుకుని వార్నింగ్ ఇవ్వడం ఏమైనా పద్దతిగా ఉందా అంటూ ఆమెపై రివర్స్ కౌంటర్స్ పడుతున్నాయి. ముందు నువ్వు నిక్కచ్చిగా ఉంటే ఎవరూ నీ జోలికి రారు కదా అంటూ నెటిజన్లు కూడా సెటైర్లు వేస్తున్నారు. ఫేస్ బుక్ పేజీలో హీరోలు, నిర్మాతలు, దర్శకుల పేర్లు పెట్టి మరీ ఇష్టమొచ్చినట్లు తిట్టే నువ్వు కూడా నీతులు చెప్తున్నావా శ్రీ రెడ్డి మరికొందరు కూడా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా యూ ట్యూబ్ ఛానెల్స్‌కు అయితే ఈమె ఇచ్చిన వార్నింగ్ ఎంతవరకు పని చేస్తుందో చూడాలిక.
First published: