SRI REDDY SENSASTIONAL COMMENTS ON MEGASTAR CHIRANJEEVI NEW LOOK TA
చిరంజీవి పై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్.. చరణ్‌ను కూడా వదలని వివాదాస్పద నటి..
చిరంజీవి,శ్రీరెడ్డి (ఫేస్బుక్ ఫోటో)
శ్రీరెడ్డి... ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. తాజాగా శ్రీరెడ్డి మెగాస్టార్ చిరంజీవిపై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
శ్రీరెడ్డి... ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లోని నటులను, అగ్ర దర్శకులను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు అవకాశాలు ఇస్తామని నమ్మించి, తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది. రీసెంట్గా ఈ భామా బిగ్‌బాస్ 3 షోను హోస్ట్ చేస్తోన్న నాగార్జునను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా శ్రీరెడ్డి చిరంజీవి కొత్త లుక్‌ను చూసి మెచ్చుకోవడం విశేషం. అందంలో అభినయంలో నటనలో డాన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి గారిని అందుకోవడం ఎవరి వల్ల కాదు అంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు చిరంజీవి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటుడు ఎన్టీఆర్, ఆ తర్వాత రామ్ చరణ్ అంటూ చెప్పుకొచ్చింది.
గతంలో ఇదే శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్‌ను అనరాని మాటలు అని పవర్ స్టార్‌ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో పవన్ అభిమానులు శ్రీరెడ్డి ట్వీట్స్, కామెంట్స్ మండి పడిన సంగతి తెలిసిందే.
చిరంజీవి,రామ్ చరణ్,శ్రీరెడ్డి (ఫేస్బుక్ ఫోటోస్)
ఏమైనా అప్పట్లో తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసి ఇపుడు అన్నయ్య చిరంజీవి మెచ్చుకోవడం ఏందో అంటూ మెగాభిమానులు చర్చించుకుంటున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.