SRI REDDY SAYS THAT A TOP HERO SPOILED HER CAREER AND POLITICALLY ALSO PK
శ్రీ రెడ్డి జీవితాన్ని ఆ హీరో నాశనం చేసాడంట.. మీరు అర్థమవుతుందా..?
శ్రీరెడ్డి (Image: Sri Reddy/Facebook)
Sri Reddy: చాలా రోజుల తర్వాత శ్రీ రెడ్డి మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. చాన్నాళ్ల తర్వాత రెచ్చిపోయింది. ఈ మధ్యే చిరంజీవి..
చాలా రోజుల తర్వాత శ్రీ రెడ్డి మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. చాన్నాళ్ల తర్వాత రెచ్చిపోయింది. ఈ మధ్యే చిరంజీవి, పవన్ కల్యాణ్ సహా ఇండస్ట్రీలో మరికొందరు హీరోలను, దర్శకులను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈమె ఈ మధ్యే మరో సంచలన ఇంటర్వ్యూ ఇచ్చింది. ఏ మాత్రం సిగ్గు పడకుండా మరోసారి సిగ్గు విడిచి స్టేట్మెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. మొన్నటికి మొన్న జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్స్ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. ఇక వీటిని మరిచిపోకముందే మరో అగ్ర హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
శ్రీ రెడ్డి (Facebook photo)
శ్రీ రెడ్డి ఎవర్నైతే మొదటగా టార్గెట్ చేసిందో.. మళ్లీ అదే హీరోపై సంచలన కమెంట్స్ చేసింది. ఈ మధ్యే ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె అందులో ఆ స్టార్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడింది. నాని అనే పేరు మాత్రం తీయకుండా.. బిగ్ బాస్ చేసుకున్నావ్.. కోట్లు నొక్కేసావు.. సినిమాలు చేసుకుంటూ కోట్లు వెనకేసుకుంటున్నావ్ ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నావంటూ రెచ్చిపోయింది.
శ్రీరెడ్డి Facebook Photo
నువ్వు నన్ను వాడుకుని.. నా జీవితం నాశనం చేసింది కాకుండా మళ్లీ ఇప్పుడు నా మీద పరువునష్టం దావా వేయడానికి సిగ్గు లేదా అంటూ విరుచుకుపడింది ఈ ముద్దుగుమ్మ. రాజకీయాల్లోకి రావాలనుకున్న తనను ఇప్పుడు అలా కూడా సక్సెస్ కాకుండా చేస్తున్నావ్ అంటూ మండిపడింది ఈ బ్యూటీ. మాట్లాడితే శ్రీ రెడ్డి బూతులు మాట్లాడింది అంటారు.. ఇలా చేస్తే కోపం రాదా అంటుంది ఈ ముద్దుగుమ్మ.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.