RIP మాధవీలత అంటూ... శ్రీరెడ్డి ఫేస్ బుక్ పోస్టు

మాధవీలతపై శ్రీరెడ్డి సంచలన పోస్టు

అయితే మాధవీలత పోస్టుపై శ్రీరెడ్డి సెటైర్లు వేయడంతో... మాధవీలత అభిమానులు, కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.

  • Share this:
    నటి శ్రీరెడ్డి మరోసారి సంచలన పోస్టు పెట్టింది. ఈ సారి ఏకంగా టాలీవుడ్ నటి మాధవిలతను ఆమె టార్గెట్ చేసింది. ‘RIP మాధవీ లత.. సారీ నువ్వింకా పోలేదా' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో.. నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. నువ్వు సచ్చిపోయి ఉంటే బావుండేదంటూ కామెంట్లు పెడుతున్నారు. అలా మెసేజ్ పెట్టడం కరెక్ట్ కాదని ఇంకొందరు తప్పుపడుతున్నారు. మరికొందరు అయితే శ్రీరెడ్డిని అసభ్య పదాలతో తిడుతున్నారు. నీకు దమ్ముంటే ఈ మెసేజ్ ఇలాగే ఉంచాలని పోస్టు డిలీట్ చేయకూడదని కామెంట్లు పెడుతున్నారు. ‘ఆమె బతికే ఉంది కానీ.. నువ్వు పోవచ్చు కదా‘ అంటూ మరో నెటిజన్ ఘాటుగా స్పందించారు.

    శ్రీ రెడ్డి (File)


    తెలుగు హీరోయిన్ మాధవీ లత ‘నచ్చావులే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. అనేక సామాజిక అంశాల పట్ల ఆమె స్పందిస్తూ ఉంటుంది. ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా... అప్పుడప్పుడు టీవీల్లో జరిగే డిస్కషన్స్‌లో మాధవీ లత ప్రత్యక్షమవుతుంటుంది. ఇక తన సోషల్ మీడియా పేజ్‌లో మాత్రం ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే తాజాగా మాధవీలత చేసిన పెట్టిన ఓ ఫేస్ బుక్ పోస్టు తీవ్ర కలకలం రేపింది. అందులో ఆమె తనకు అనేక అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని త్వరలోనే నేను కూడా చచ్చిపోతానని రాసింది. ఎదో ఒక రోజు ప్రేమ సినిమాలో హీరోయిన్ రేవతి చనిపోయినట్లు తానుకూడా ఏ మందులు పనిచేయక ఒకరోజు చనిపోతానని తన ఫ్రెండ్స్‌తో ఎప్పుడూ చెబుతూ ఉంటానని పేర్కొంది. ఆ సినిమాలో హీరోయిన్ వేసుకున్నట్లు తాను ప్రతీ దానికి నిత్యం ఏదో ఓక మెడిసన్స్ వేసుకుంటూ ఉంటానని తెలిపింది. ఏదో ఒక రోజు ఏ మందు పనిచేయక తాను కూడా చనిపోతానని తెలిపింది. తనకు మైగ్రేన్ తలనొప్పి,జలుబు, జ్వరం, నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నానని తెలిపింది.

    మాధవీలత


    అయితే మాధవీ లత పెట్టిన ఈ ఫేస్ బుక్ పోస్టుపై ఆమె అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. జీవితంలో ఎవరికైనా ఇలాంటి కష్టాలు కామన్ అని ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ మాత్రం దానికే చనిపోతారా అని భరోసా ఇస్తున్నారు. కొందరైతే తమకు కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మరికొందరు బీ పాజిటివ్.. అంతా మంచే జరుగుతుందని మద్దతు ఇస్తున్నారు. ఇంకొందరు రెస్ట్ తీసుకో అంటూ మాధవీ లతకు సలహాలు ఇస్తున్నారు.అయితే మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో మాధవీలత స్పందించింది. తాను చనిపోవడం లేదంటూ మళ్లీ క్లారిటీ ఇచ్చి... ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టును కూడా డిలీట్ చేసింది. దయచేసి ఇలా వార్తలు రాయోద్దంటూ మీడియాను కోరింది. అయితే ఇప్పుడు ఆమె పెట్టిన పోస్టుపై శ్రీరెడ్డి సెటైర్లు వేయడంతో... మాధవీలత అభిమానులు, కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విషయంలో శ్రీరెడ్డిని నెటిజన్స్ ఉతికి ఆరేస్తున్నారు. మరి మాధవీలత శ్రీరెడ్డి పోస్టుపై స్పందిస్తుందో లేదో చూడాలి.
    Published by:Sulthana Begum Shaik
    First published: