మానవ మృగాల రాక్షసత్వానికి బలైన దిశ ఉదంతంపై యావత్ దేశం నిరసనలు వ్యక్తం చేస్తోంది. తాజాగా దిశా పై జరిగిన అత్యాచార ఘటనపై ప్రముఖ నటి శ్రీరెడ్డి స్పందించింది.
ఏడేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం తర్వాత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది హైదారాబాద్లో జరిగిన దిశా అత్యాచార ఉదంతం. ఈ దేశ వ్యాప్తంగా ప్రజులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఈ పాశవిక ఘటనను ఖండిస్తున్న సంగతి తెలిసిందే కదా. మానవ మృగాల రాక్షసత్వానికి బలైన దిశ ఉదంతంపై యావత్ దేశం నిరసనలు వ్యక్తం చేస్తోంది. తాజాగా దిశా పై జరిగిన అత్యాచార ఘటనపై ప్రముఖ నటి శ్రీరెడ్డి స్పందించింది. రెండు రోజుల నుంచి తనకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఈ ఘటనపై స్పందించడానికి సమయం పట్టిందని తన ఫేస్బుక్ వీడియోలో తెలిపింది. అసలు దేశంలో ఆడవాళ్లంటే లెక్క లేకుండా పోతుందని తన ఆవేదన వెల్లగక్కింది శ్రీరెడ్డి. న్యాయ వ్యవస్థలోని లొసుగుల వల్ల మృగాలు రెచ్చిపోతున్నాయని పేర్కొంది. అవసరమైతే.. పోలీసులను పెట్టి మహిళలకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలంది. సొంతింట్లో కూడా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.విదేశాల్లో అమలు చేస్తున్న చట్టాలను ఇక్కడ కూడా అమలయ్యేలా ప్రధాని మోదీ దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే ఎన్నో కొత్త చట్టాలను తీసుకొచ్చిన ఆయన పాశవిక అత్యాచార నిందితులకు వెంటనే ఉరి అమలయ్యేలా చట్టంలో మార్పులు తీసుకొస్తారనే ఆశాభావంతో ఉన్నానన్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.