శ్రీ రెడ్డి గురించి కొత్తగా పరిచయాలు ఎందుకు.. ఈమె చిన్నసైజ్ లేడీ రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో తెలియదు. ముఖ్యంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను అయితే ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అప్పట్లో తను ఫేమస్ కావాలంటే పవన్ కళ్యాణ్‌ను తిట్టాలని వర్మ చెప్పినట్లు అందరి ముందు చెప్పింది కూడా ఈ భామ. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్ అయిపోయి తన పని తాను చేసుకుంటుంది శ్రీ రెడ్డి. ఈ క్రమంలోనే ఈమెకు మళ్లీ సినిమాల్లో అవకాశాలు అప్పుడప్పుడూ వస్తున్నాయి.
శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో (Image: Srireddy/ Facebook)
తాజాగా వర్మ తెరకెక్కిస్తున్న 'పవర్ స్టార్' సినిమాకు కౌంటర్‌గా పరాన్న జీవి అనే మరో సినిమా తెరకెక్కిస్తున్నారు పవన్ అభిమానులు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని, 'బిగ్ బాస్' సీజన్ 2 కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వర్మ చేస్తున్న 'పవర్ స్టార్'కు పోటీగా ఈ 'పరాన్నజీవి'ని రిలీజ్ చేస్తున్నారు.
పరాన్న జీవి టైటిల్ లోగో (Parannajeevi title)
జులై 24న 'పవర్ స్టార్' కానుంది. అదే రోజు పరాన్న జీవి సినిమాను కూడా వదులుతున్నారు. అయితే పవర్ స్టార్‌కు వ్యతిరేకంగా వస్తున్న ఈ చిత్రంలో శ్రీ రెడ్డిని నటించాలని కోరారు దర్శక నిర్మాతలు. ఈమె నటిస్తుందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిపై శ్రీ రెడ్డి స్పందించింది. తనను 'పరాన్నజీవి'లో నటించమని అడిగారని.. కానీ ఆ ఆఫర్‌ను తాను ఒప్పుకోలేదని చెప్పింది శ్రీ రెడ్డి.
వర్మ పవర్ స్టార్ స్టిల్ (RGV Power Star movie)
'ఐ లవ్ రామ్ గోపాల్ వర్మ.. నేనెందుకు చేస్తాను' అని సమాధానం ఇచ్చింది శ్రీ రెడ్డి. అంటే 'పరాన్నజీవి'లో శ్రీ రెడ్డి ప్రస్తావన తీసుకొస్తున్న విషయం నిజమే అయ్యుండొచ్చు. కానీ ఈమె మాత్రం నటించనని చెప్పింది. మరోవైపు పవర్ స్టార్ సినిమాలో కూడా శ్రీ రెడ్డి పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి చూడాలిక.. పవర్ స్టార్ వర్సెస్ పరాన్న జీవి మధ్య వార్ ఎలా ఉండబోతుందో..?
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.