క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలతో టాలీవుడ్లో ప్రకంపనాలు క్రియేట్ చేసిన నటి శ్రీరెడ్డి.. ఆ తర్వాత కోలీవుడ్‌ని వదలని సంగతి తెలిసిందే. కాస్టింగ్ కోచ్ వ్యవహారం చల్లబడినా సోషల్ మీడియాలో ఏదో కామెంట్ చేస్తూ వార్తల్లో నానుతూనే ఉంది శ్రీరెడ్డి. తనని అవకాశాల పేరిట కొంతమంది మోసం చేశారంటూ ఒక్కొక్కరి పేరు చెబుతూ దక్షిణాదిన సంచలనం క్రియేట్ చేసింది శ్రీరెడ్డి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసి మరోసారి రచ్చ చేస్తోంది. ఆ మధ్య బిగ్‌బాస్ తెలుగులో తనని తీసుకునేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తే కొంతమంది అడ్డుపడ్డారని నిప్పులు చెరిగింది ఈ భామ. ఇదిలా ఉండగానే తమిళం బిగ్‌బాస్ 3లో శ్రీరెడ్డిని తీసుకునేందుకు దాదాపు లైన్ క్లియర్ అయిందంటూ అక్కడి మీడియా కోడై కూస్తోంది. ఈ టైమ్‌లోనే శ్రీరెడ్డి ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. మీలో ఎంతమంది బిగ్‌బాస్‌లో నన్ను చూడాలనుకుంటున్నారు... తెలుగు బిగ్‌బాస్ ఆ... లేక తమిళ్ బిగ్‌బాస్ ఆ అంటూ ఫేస్బుక్లో ఓ పోస్టు చేసింది. దీనికి చాలామంది రకరకాలు స్పందించారు.
ఓ నెటిజన్ కాస్తా ముందుకెళ్లి‘నీకు రాణించే సామర్థ్యం ఉంటే.. నేను నీకు సపోర్ట్ చేస్తా.. తెలుగు బిగ్‌బాస్ షోలో నిన్ను చూడాలనుకుంటున్నా’ అంటూ కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన శ్రీరెడ్డి.. కాంపిటీటర్స్గా పవన్‌కళ్యాణ్, అభిరామ్, నాని, మురుగదాస్, శ్రీకాంత్... ఓన్లీ వన్స్ ఫసక్ అంటూ తన స్టైల్లో కామెంట్ చేసింది. ఇంతటితో ఆగక నేను బిగ్‌బాస్‌లో ఉంటే ఫుల్ సెన్సార్ ప్రాబ్లమ్.. బీప్స్ హె.. హె.. అంటూ కామెంట్ చేసింది. వీటికి నెటిజన్స్ కామెంట్లతో స్పందిస్తున్నారు.. మరి ఈ కామెంట్ల వర్షం అక్కడక్కడ జల్లుల్లా మారైనా.. తనకి బిగ్‌బాస్ సీజన్లో అవకాశం వచ్చేలా చూడాలంటూ మరికొంతమంది కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss, Bigg Boss 3, Nani, Pawan kalya, Sri Reddy, Telugu Cinema, Telugu Cinema News, Tollywood