SRI REDDY PRAISES JR NTR HE WAS ONLY BIGG BOSS NAGARJUNANANI NOT BIGG BOSS HERE ARE THE DETAILS TA
Bigg Boss 3: ఎన్టీఆర్‌ను అడ్డం పెట్టుకొని నాగార్జునను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి..
ఎన్టీఆర్,శ్రీరెడ్డి,నాగార్జున (ఫైల్ ఫోటోస్)
శ్రీరెడ్డి... ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ భామ.. ఎన్టీఆర్‌లా బిగ్‌బాస్‌ను ఎవరు హోస్ట్ చేయలేరంటూ..నాగార్జునకు చురకలు అంటించింది.
శ్రీరెడ్డి... ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లోని నటులను, అగ్ర దర్శకులను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు అవకాశాలు ఇస్తామని నమ్మించి, తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో నాని తనతో పడక సుఖాన్ని పంచుకున్నాడని సంచలన ఆరోపణలు చేసిన వార్తల్లో నిలిచింది. అంతేకాదు జనసేనాని పవన్ కళ్యాణ్ పై అవకాశమొచ్చిన ప్రతీసారి తనదైన విరుచుకు పడుతూనే ఉంది. ఎపుడు ఎవరినీ ఎలా టార్గెట్ చేస్తుందో ఎవరికి అంతుపట్టదు. తాజాగా శ్రీరెడ్డి.. బిగ్‌బాస్ 3లో పార్టిసిపేట్ చేయబోతున్నట్టు చూచాయగా ప్రకటించింది. అంతేకాదు తనతో పాటు నాగబాబు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయనున్నట్టు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే కదా.
బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ డేట్
ఎపుడు తన ట్వీట్లతో సంచలనం రేపే శ్రీరెడ్డి.. తాజాగా ఎన్టీఆర్‌ను మెచ్చుకుంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఈ ట్వీట్లో బిగ్‌బాస్ షోను ఎన్టీఆర్ హోస్ట్ చేసినట్టు ఇంకెవరు చేయలేరని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ యాంకరింగ్ ఎన్టీఆర్ చేసినట్టు ఈ ప్రపంచంలో మరెవరు చేయలేరంది. ఎప్పటికైనా ఎన్టీఆర్‌ని కలిసి ఒకే ఫోటో దిగాలనేది తన కోరిక అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు ఎన్టీఆర్‌ను ఉద్దేశిస్తూ.. మీరు బిగ్‌బాస్ షోకి రండి సార్. ఎంతోమంది తెలుగు వాళ్లము.. మీ రాక కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ చెప్పి.. ఇన్ డైరెక్ట్‌గా నాగార్జున ఈ షోను అంతబాగా నడిపించలేడని తనదైన శైలిలో చురకలు అంటించింది. అంతకు ముందు బిగ్‌బాస్ సెకండ్ సీజన్‌ను హోస్ట్ చేసిన నాని పై శ్రీరెడ్డి ఓ రేంజ్లో విరుచుకుపడిన సంగతి తెలిసిందే కదా. మొత్తానికి శ్రీరెడ్డి..ఎన్టీఆర్ బిగ్‌బాస్ షోను నడిపించిన విధానాన్ని తప్పుపట్టక పోయినా.. నాగార్జునను డీ గ్రేట్ చేసేలా ట్వీట్ చేయడం బాగాలేదని చెబుతున్నారు. మొత్తానికి ఈ నెల 21న ప్రసారం కానున్న స్టార్ మాలో నాగార్జున బిగ్‌బాస్ షోను తనదైన యాంకరింగ్‌తో ఏ మేరకు మెప్పిస్తాడో లేదో చూసి శ్రీరెడ్డి ట్వీట్ చేస్తే బాగుంటుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.