పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌పై శ్రీ రెడ్డి సంచలనం..

Sri Reddy: శ్రీ రెడ్డి మరోసారి రెచ్చిపోయింది. ఈమెకు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం తప్ప మరో పని లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు పవర్ స్టార్ జోలికి వెళ్లడం.. ఫ్యాన్స్‌తో చివాట్లు తినడం ఈమెకు అలవాటుగా మారిపోయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 13, 2020, 8:34 PM IST
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌పై శ్రీ రెడ్డి సంచలనం..
శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ (File Photo)
  • Share this:
శ్రీ రెడ్డి మరోసారి రెచ్చిపోయింది. ఈమెకు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం తప్ప మరో పని లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు పవర్ స్టార్ జోలికి వెళ్లడం.. ఫ్యాన్స్‌తో చివాట్లు తినడం ఈమెకు అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు కూడా మరోసారి ఇదే చేసింది శ్రీ రెడ్డి. గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత దారుణమైన పోస్ట్ చేసింది ఈ కాంట్రవర్సియల్ క్వీన్. సోషల్ మీడియాలో ఈమె చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సంచలనంగా మారుతుంది. పవన్‌ను దారుణంగా అవమానించేలా ఉన్న ఈ పోస్ట్ చూసి అభిమానులకు కూడా మండిపోతుంది. శ్రీ రెడ్డి నువ్వు కానీ మాకు దొరికితే చంపేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఫ్యాన్స్.

శ్రీ రెడ్డి, పవన్ కళ్యాణ్ (File Photo)
శ్రీ రెడ్డి, పవన్ కళ్యాణ్ (File Photo)


ఎప్పుడూ మాటలతో రెచ్చిపోయే శ్రీ రెడ్డి ఇప్పుడు ఏకంగా చేతల వరకు వెళ్లింది. ఆ మధ్య సోషల్ మీడియాలో ఆ మధ్య పవన్‌ను కాలుకింద వేసి తొక్కేస్తున్నట్లు ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసి పాపం రా అంటూ రాసుకొచ్చింది. ఇక ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా గురించి నోటికొచ్చినట్లు రాసింది శ్రీ రెడ్డి. దాంతో పాటు చిరంజీవి, మోహన్ బాబులను కూడా టార్గెట్ చేసింది. చిరంజీవి, మోహన్ బాబుకు మోదీతో పాటు అమిత్ షా కూడా అప్పాయింట్‌మెంట్ ఇస్తారు కానీ పవన్ కళ్యాణ్‌కు మాత్రం ఇవ్వడు.. అది ఆయన రేంజ్ అంటూ విమర్శలు చేసింది.

పవన్ కళ్యాణ్‌పై శ్రీ రెడ్డి చేసిన అసభ్యకరమైన పోస్టులు
పవన్ కళ్యాణ్‌పై శ్రీ రెడ్డి చేసిన అసభ్యకరమైన పోస్టులు


దాంతో పాటు పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్‌కు పవన్ కళ్యాణ్ సూట్ కాడు.. ఆ సినిమాలో ఆయన హీరో అంటే నా మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ బూతులు కూడా పెట్టింది శ్రీ రెడ్డి. గతంలో కూడా జగన్ మూడు రాజధానుల విషయంపై పవన్ చేస్తున్న విమర్శలు శ్రీ రెడ్డికి అస్సలు నచ్చలేదు. దాంతో తనకు ఇష్టమొచ్చినట్లు ఆయన్ని టార్గెట్ చేస్తుంది ఈమె. పవన్ కళ్యాణ్ గారూ నిజంగా మీరు అంత మంచోళ్ళయితే మీ భార్య రేణు దేశాయ్ మిమ్మలను ఎందుకు వదిలేసిందంటూ ప్రశ్నించింది. అంతటితో ఆగకుండా బూతుపురాణం మొదలెట్టింది.

పవన్ కళ్యాణ్‌పై శ్రీ రెడ్డి చేసిన అసభ్యకరమైన పోస్టులు
పవన్ కళ్యాణ్‌పై శ్రీ రెడ్డి చేసిన అసభ్యకరమైన పోస్టులు


ఈ పోస్ట్ చూస్తుంటే శ్రీ రెడ్డిని చంపేయాలన్నంత కసితో ఉన్నారు అభిమానులు. అసలు ఓ వ్యక్తిని అంత దారుణంగా ఎలా టార్గెట్ చేస్తారు.. కోపం ఉంటే మరీ ఇంతగా దిగజారిపోవాలా అంటూ శ్రీ రెడ్డిపై విమర్శల వర్షం కురుస్తుంది. శ్రీ రెడ్డి మాట్లాడిన తీరు చూసి అంతా ఆమెను తిట్టి పోస్తున్నారు. అసలు పవన్ నిన్నేం చేసాడు.. నువ్వు మోసపోయింది చిన్నోళ్ల దగ్గర కదా.. వాళ్లను టార్గెట్ చేయకుండా ఎందుకు పవన్ మీద పడుతున్నావంటూ ఫ్యాన్స్ కడిగిపారేస్తున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: March 13, 2020, 8:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading