Sri Reddy: నైట్ పార్టీలో టాలీవుడ్ సీనియర్ హీరోతో శ్రీరెడ్డి రచ్చ రంబోలా..

శ్రీరెడ్డి (Youtube/Photo)

సౌత్ సినీ ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. రోజు తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఏదో ఒక వివాదాస్పద పోస్ట్‌లు పెడుతూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా శ్రీరెడ్డి చెన్నైలోని ఓ పబ్‌లో ఓ సీనియర్ హీరోతో రచ్చ చేసింది.

  • Share this:
    సౌత్ సినీ ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. రోజు తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఏదో ఒక వివాదాస్పద పోస్ట్‌లు పెడుతూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్, హీరో నాని పై టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచింది. రీసెంట్‌గా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను డేటింగ్‌కు రమ్మని ఓపెన్ ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలో ఉంటుంది. అంతేకాదు ఒక్కోసారి భక్తురాలిగా మారి ప్రేక్షకులను ఆశ్యర్యచకితులను చేస్తూనే ఉంది. తాజాగా శ్రీరెడ్డి చెన్నైలో తన క్లోజ్ ఫ్రెండ్స్ కొందరికి కొత్త ప్రారంభమైన పబ్‌లో నైట్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో శ్రీరెడ్డి మరోసారి తన హాట్ నెస్‌ను బయటపెట్టింది. ఈ పార్టీకి శ్రీరెడ్డి క్లీవేజ్ షోతో అదరగొట్టింది. తాజాగా ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులకు షేర్ చేసింది. ఈ పార్టీలో ఒకప్పుడు టాలీవుడ్‌లో విలన్‌గా .. ఆ తర్వాత హీరోగా నటించిన పృథ్వీ కాసేపు కనిపించి అలరించాడు. అపుడెపుడో ‘పెళ్లి’, ‘సమర సింహారెడ్డి’, ‘పెళ్లి పందిరి’ సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు పృథ్వీ. రీసెంట్‌గా ‘ఎన్టీఆర్ మహానాయకుడు’తో పాటు ‘కథనం’ సినిమాల్లో ముఖ్యపాత్రలో కనిపించాడు. ఆ తర్వాత ఎక్కడ పెద్దగా కనిపించింది లేదు. తాజాగా శ్రీరెడ్డి పార్టీలో పృథ్వీ కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈయన మాములుగా ఈ పార్టీకి వచ్చాడా.. ? శ్రీరెడ్డి ఏమైనా స్పెషల్‌గా ఇన్వైట్ చేసిందా అనేది మాత్రం తెలియదు. ప్రస్తుతం శ్రీరెడ్డి తమిళంలో కొన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: