news18-telugu
Updated: September 14, 2020, 8:31 AM IST
మంచు లక్ష్మి, రకుల్ ను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి (File/Photos)
Sri Reddy Rakul |శ్రీరెడ్డి... ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లోని నటులను, అగ్ర దర్శకులను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు అవకాశాలు ఇస్తామని నమ్మించి, తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది. తెలుగులో దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్, హీరో నాని పై టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచింది. తాజాగా శ్రీ రెడ్డి.. హీరోయిన్ రకుల ప్రీత్ సింగ్‌తో పాటు మంచు లక్ష్మీల పై తన దైన శైలిలో ఫైర్ అయింది.

శ్రీ రెడ్డి, రకుల్ ప్రీత్ (File/Photo)
ఇది ప్రతీకారం కాదు..నేను అప్పట్లో టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఉద్యమం చేస్తోన్నపుడు రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి.. టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ వంటివి గానీ, డ్రగ్స్ కానీ అలాంటి ఏమి లేవు. ఇక్కడ ఎవరు ఎవరినీ తిట్టరు అంటూ పెద్ద క్యాండిల్ ర్యాలీ చేసిందిగా అంటూ కాస్త వెటకారంగా రకుల్ ను టార్గెట్ చేసింది. అంతేకాదు మంచు లక్ష్మి ఏమో.. మా ఇండస్ట్రీలో డ్రగ్స్ ఉన్నాయా ? కాస్టింగ్ కౌచ్ ఉందా ? అందాల మేడలో ఉన్న మమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ అపుడు మంచు లక్ష్మీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా శ్రీ రెడ్డి గుర్తు చేసింది.

శ్రీ రెడ్డి (File/Photo)
ఈ రోజు డ్రగ్స్ విషయంలో రకుల్ పేరు బయటకు వచ్చింది. టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ లేదు అంటూ చెప్పిన రకుల్.. బాలీవుడ్లో మాత్రం అక్కడ కాస్టింగ్ కౌచ్ ఉండకూడదంటూ చెప్పడం రెండు నాల్కల ధోరణి కాదా అని ప్రశ్నించింది. ఇక డ్రగ్స్ విషయంలో రకుల్ పేరు ఎలా వచ్చిందో తెలియదు. ఆ రోజు నా గురించి ఏవో చెత్త వాగుడు వాగినా రకుల్ అసలు విషయాలు ఇపుడు బయటకు వస్తున్నాయంది. నాకు వచ్చిన చెడ్డ పేరు ఎలాగో వచ్చింది. ఎవరు చేసిన కర్మను వాళ్లు అనుభవించక తప్పదు అంటూ వేదాంతం మాట్లాడింది శ్రీ రెడ్డి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
September 14, 2020, 8:31 AM IST